యూజర్లకు షాకిచ్చిన ఎక్స్, ఒకేసారి అకౌంట్లన్నీ బ్లాక్

సోషల్ మీడియా వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది ఎక్స్. ఉదయం నిద్ర లేచి చూసే సరికి తమ అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి. ఎవరైనా హ్యాక్ చేశారేమో అని చాలా మంది యూజర్లు కంగారు పడ్డారు. అయితే తామే అధికారికంగా అకౌంట్లు బ్లాక్ చేశాం అని ఎక్స్ ప్రకటించేసింది. అంతే కాదు కేంద్రానికి కూడా తప్పు జరిగిందని చెప్పింది. ఇంతకి ఎక్స్ ఎందుకు ఇలా చేసింది?. అకౌంట్లు సస్పెండ్ చేయడం వెనక బలమైన కారణాలేంటి.?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో అసభ్యకర కంటెంట్ ఎక్కువైంది. ఒక్క పదంలో చెప్పాలంటే దీన్ని పూర్తిగా మాసాల సైట్ లా మార్చేశారు కామాంధులు. భారీగా దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తిన తరుణంలో కేంద్రం ఎక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోకపోతే ఇండియాలో బ్యాన్ తప్పదని హెచ్చరించింది. వెంటనే తప్పును సరిచేసుకునే దిశగా అడుగులు వేశారు ఎలాన్ మస్క్.

X Removes 3 500 Objectionable Posts Bans 600 Accounts After India s Stern Warning

ఈ చర్యలకు ప్రధాన కారణంగా మారింది ఎక్స్‌కు చెందిన గ్రోక్ (Grok) ఏఐ సేవలు. ఏఐ ద్వారా అసభ్యకరమైన, లైంగికంగా స్పష్టమైన కంటెంట్ సృష్టించబడుతోందని కేంద్రం గుర్తించింది. జనవరి 2న ఎక్స్‌కు నోటీసు జారీ చేసిన ఐటీ మంత్రిత్వ శాఖ, గ్రోక్ ద్వారా ఉత్పత్తైన అన్ని చట్టవిరుద్ధ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అంతేకాదు, 72 గంటల్లోపు యాక్షన్ టేకన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని, గ్రాక్ సంబంధించి తీసుకున్న సాంకేతిక, పరిపాలనా చర్యలను వివరించాలని కేంద్రం ఆదేశించింది. చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ పర్యవేక్షణ, అభ్యంతరకర కంటెంట్‌పై తీసుకున్న చర్యలు, వినియోగదారులు-ఖాతాలపై విధించిన ఆంక్షలు అన్నీ ఈ నివేదికలో తప్పనిసరిగా పొందుపరచాలని సూచించింది.

కేంద్రం చేసిన లోతైన పరిశీలనలో మరిన్ని షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. గ్రోక్ ఏఐని ఉపయోగించి నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించడం, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం, ప్రాంప్ట్‌లు-ఇమేజ్ ఎడిటింగ్-సింథటిక్ కంటెంట్ ద్వారా వారి దృశ్యాలను తారుమారు చేయడం వంటి దుర్వినియోగాలు జరుగుతున్నట్లు గుర్తించింది. దీనిని డిజిటల్ భద్రతకు తీవ్రమైన ముప్పుగా కేంద్రం పరిగణిస్తోంది.

అశ్లీల, అసభ్య కంటెంట్ వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌పై ఉక్కుపాదం మోపింది. భారతీయ చట్టాలకు లోబడి పనిచేస్తామని ఎక్స్ తప్పును అంగీకరిస్తూ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇప్పటికే ప్లాట్‌ఫారమ్‌లో పెద్దఎత్తున క్లీన్-అప్ ఆపరేషన్ ప్రారంభమైంది.

కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ జోక్యంతో, ఎక్స్ ఇప్పటివరకు 3,500కు పైగా అభ్యంతరకర పోస్టులను తొలగించగా, 600కు పైగా ఖాతాలను శాశ్వతంగా రద్దు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని సంస్థ స్పష్టం చేసింది. కంటెంట్ మోడరేషన్ విధానాలను మరింత కఠినంగా మార్చి, భారతీయ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని అంగీకరించింది.

జనవరి 8న ఎక్స్ కేంద్రానికి సుదీర్ఘ వివరణ సమర్పించినప్పటికీ, దానిని ప్రభుత్వం సరిపోని వివరణ గా పేర్కొంది. ఈ ఘటనలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా మరింత కఠినంగా మారనున్న సంకేతాలుగా మారాయి. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+