వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Yaas: తుపాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు: ఐఎండీ హెచ్చరిక

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని. ఈ 'యాస్’ తుపాను రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను మారుతుందని అమరావతి వాతావరణశాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.

మంగళవారం ఉదయం 8.30 సమయానికి యాస్ తుపాను పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది.

ఇది పెను తుపానుగా మారి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్ మధ్య బుధవారం మధ్యాహ్నం తీరం దాటొచ్చని పేర్కొంది.

తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.

https://twitter.com/Indiametdept/status/1397088337991585793

''యాస్' తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడి ఉంటుంది. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని స్టైలా ఒక చెప్పారు.

కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సమస్య రాకూడదు..

'యాస్' తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విశాఖ వెళ్లాలని ఆదేశించారు.

"తుపాను వల్ల కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. తుపాను కారణంగా ఆక్సిజన్‌ ప్లాంట్లకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి వారిని తరలించాలన్న దానిపై వెంటనే నిర్ణయం తీసుకుని, తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని తరలించాలి. " అని సమావేశంలో అధికారులను ఆదేశించారు.

మరోవైపు తుపాను సన్నద్ధతపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిషా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపానుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అమిత్‌షాకు జగన్‌ తెలిపారు.

పశ్చిమబెంగాల్ తీరంలో బోట్లు

మత్స్యకారులు వెనక్కి రావాలి...

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

సముద్రంలో అలలు 2.90 నుంచి 4.5 మీటర్లు ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పారు.

మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలో వేట చేస్తున్న మత్స్యకారులు వెంటనే తీరానికి రావాలన్నారు.

"ఈ తుపాను ప్రభావం ఒడిశా, బెంగాల్ పై అధికంగా ఉంటుంది. తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 150 నుంచి 160 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి.

మే 25 నుంచి బెంగాల్ లోని కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

ఇదే సమయంలో ఒడిశాలోని కోస్తా జిల్లాలైన బాలేశ్వర్, భద్రక్, జగత్‌సింగ్‌పూర్‌లపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది" గోపాల్‌పూర్‌ డాప్లార్‌ రాడార్‌ కేంద్రం అధికారి ఉమాశంకర్‌ దాస్‌ మీడియాతో చెప్పారు.

రంగంలోకి నేవీ, కోస్ట్ గార్డ్...

వాతావరణశాఖ హెచ్చరికలతో తుపాను ప్రభావిత రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తుపాను కారణంగా...ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు.

మరోవైపు తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ తెలిపారు.

అవసరమైన సమయాల్లో ప్రజలను తరలించేందుకు 149 బృందాలు, మరో 99 బృందాలు క్షేత్రస్థాయిలో మోహరించామని ప్రధాన్ చెప్పారు.

తుపానును ఎదుర్కొనేందుకు నేవీ, కోస్ట్ గార్డ్ సైతం అప్రమత్తమయ్యాయి. నాలుగు యుద్ధ నౌకలు, 11 సరకు రవాణా విమానాలు, 25 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు నేవీ ప్రకటించింది.

రైలు ప్రయాణికులు

100 రైళ్లు రద్దు...

ఈ తుపాను తీవ్రతతో ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌, బాలాసోర్‌, భద్రక్‌లలో తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉంది.

ఒడిశాలోని పూరీ, కటక్‌, జైపూర్‌, మయూర్‌బంజ్‌లలో గాలులు గంటకు 120 నుంచి 130 వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు ఒడిశా వాతావరణశాఖ తెలిపింది.

అదే సమయంలో తుపానుక కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.

భువనేశ్వర్- పూరి , పూరి -చెన్నై మధ్య నడిచే 90 రైళ్లను రద్దు చేసింది. మరో 10 రైళ్ళను కూడా రద్దుచేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Yaas: తుపాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు: ఐఎండీ హెచ్చరిక
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X