యాకూబ్ మెమెన్ కొత్త డ్రామా: సుప్రీంలో అర్జీ
న్యూఢిల్లీ/ముంబై: ముంబై నగరంలో వరుస బాంబు పేలుళ్లు సృష్టించి అనేక మంది ప్రాణాలు పోట్టన పెట్టుకున్న యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్ అలియాస్ యాకూబ్ మెమెన్ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. తన ఉరి శిక్షను నిలిపివెయ్యాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
గురువారం యాకూబ్ మెమెన్ న్యాయవాదులు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు. తన క్షమాభిక్ష అర్జీ మహారాష్ట్ర గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని, అందు వలన తన ఉరి శిక్షను రద్దు చెయ్యాలని యాకూబ్ మెమెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

1993వ సంవత్సరంలో ముంబై నగరంలోని పలు రైల్వే స్టేషన్ లలో బాంబు పేలుళ్లు జరిగి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే కేసులో అరెస్టు అయిన యాకూబ్ కు ఉరి శిక్ష విధించారు. జులై 30వ తేదిన యాకూబ్ కు ఉరి శిక్ష విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ ను ఉరి తియ్యడానికి సిద్దం చేశారు. ఈ సందర్బంలో ఉరి శిక్ష నుండి తప్పించుకోవడానికి యాకూబ్ సుప్రీంను ఆశ్రయించాడు. యాకూబ్ సమర్పించిన క్షమాభిక్ష అర్జీని ఈనెల 21వ తేదిన సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications