700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు: మోడీ ప్రభుత్వంపై యశ్వంత్ ఆగ్రహం
పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై యశ్వంత్ సిన్హా మరోసారి విమర్శలు గుప్పించారు. 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై యశ్వంత్ సిన్హా మరోసారి విమర్శలు గుప్పించారు. 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 700 ఏళ్ల క్రితమే నోట్ల రద్దు తీసుకొచ్చారన్నారు.
ఎంతో మంది రాజులు తమ సొంత కరెన్సీని తీసుకొచ్చారని, మరికొంతమంది పాత కరెన్సీ పంపిణీ జరుగుతున్నా కొత్తవాటిని ప్రవేశపెట్టారని, కానీ 700ఏళ్ల క్రితం తుగ్లక్ పాత కరెన్సీని రద్దు చేసి తన సొంత కరెన్సీని తీసుకొచ్చారన్నారు.

అంటే 700ఏళ్ల క్రితమే నోట్లరద్దు జరిగిందని తెలుస్తోందన్నారు.
నోట్లరద్దు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై తమ అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా లోక్‌షాహి బచావో అభియాన్( సేవ్ డెమోక్రసీ మూమెంట్) అనే ఓ గ్రూప్ సిన్హాను ఆహ్వానించింది. గుజరాత్‌కు అరుణ్ జైట్లీ పెద్ద బరువు అన్నారు.












Click it and Unblock the Notifications