జై షాపై ఆరోపణలు: తప్పు జరిగే ఉండొచ్చు: యశ్వంత్‌సిన్హా సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పాట్నా:పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌‌సిన్హా మరోసారి బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు.పార్టీలో చోటుచేసుకొంటున్న పరిణామాలపై యశ్వంత్‌సిన్హా తన అభిప్రాయాలను మరోసారి కుండబద్దలు కొట్టారు. ఈ సారి ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లక్ష్యంగా విమర్శలు కురిపించారు యశ్వంత్‌సిన్హా.

  సొంతపార్టీలోని అగ్రనేతలు బీజేపీకి కొరకరాని కొయ్యలా మారారు. ఆ పార్టీలో జరుగుతున్న తప్పులను వారే స్వయంగా ఎత్తి చూపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ విధానం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందంటూ నేరుగా విమర్శల దాడి చేసిన బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా మరోసారి బాంబులాంటి విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కుమారుడు జై షా కుమారుడిపై అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్లయిందన్నారు.

  Yashwant Sinha Alleges Many BJP Lapses In Handling Jay Shah Case

  'పలు పొరపాట్ల కారణంగా బీజేపీ ఇప్పుడు గిల్టీగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు యశ్వంత్‌సిన్హా. వ్యాపారవేత్త అయిన జై షా కోసం ప్రభుత్వ ఉన్నత న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను కోర్టులో దించడం సరికాదు' అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జై ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయంటూ ది వైర్‌ అనే ఓ వెబ్‌ సంస్థ కథనం వెలువరించిన నేపథ్యంలో దానిపై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

  ఈ కేసును వాధించడానికి ప్రభుత్వ న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను రంగంలోకి బీజేపీ దించింది. దీనిని యశ్వంత్‌ సిన్హా తప్పుబట్టారు. 'విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ అమిత్‌ షా కుమారుడికి రుణాన్ని మంజూరు చేసిన విధానాన్ని యశ్వంత్‌సిన్హా తప్పుబట్టారు. అంతేకాదు జై షాను వెనుకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు యశ్వంత్ సిన్హా.. ప్రభుత్వం ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇందులో చాలా శాఖలు జోక్యం చేసుకున్నట్లు అనిపిస్తోందని' ఆయన అభిప్రాయపడ్డారు.

  English summary
  After his recent slapdown of the government's handling of the economy, former union minister Yashwant Sinha today said that his party has "lost the moral high ground" due to a corruption scandal involving the son of its chief Amit Shah. Yashwant Sinha, 79, said that the BJP appears guilty of many lapses: producing senior ministers to defend Mr Shah's son, entrepreneur Jay Shah, and farming out a top government lawyer, Tushar Mehta, to represent Jay Shah in court.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more