Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2021: భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో జరిగిన ప్రధాన ఘటనలు-తీపి చేదు జ్ఞాపకాలు

2021 భారత్‌లో ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. ఏదో ఒక వార్తతో భారత్ ప్రపంచ దేశాల సరసన నిలిచింది. ఇటు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారీ నుంచి అటు ఒలింపిక్స్, తుఫాన్లు, సెలబ్రిటీల మరణాలు ఇలా చాలా వరకు తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అన్ని రంగాల్లో దేశం వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం, కరోనా సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం, నిరసనలు, రాజకీయ ఒడిదుడుకులు ఇలా చాలా సందర్భాల్లో భారత్ వార్తల్లో నిలిచింది. ఇక 2021వ సంవత్సరం ముగుస్తుండటంతో ఈ ఏడాది మిగిల్చిన తీపి చేదు జ్ఞాపకాలు మీకోసం.

Year Ender 2021: The major events that took place in India and around the world-Check here

December 2021
  • మిస్ యూనివర్శ్‌గా హర్నాజ్ సంధు
    మిస్ యూనివర్శ్‌గా హర్నాజ్ సంధు
    చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్శ్‌గా ఎంపికైంది. ఇజ్రాయిల్‌లో జరిగిన మిస్ యూనివర్శ్ గ్రాండ్ ఫినాలేలో ఈ ముద్దుగుమ్మకు విశ్వసుందరి కిరీటం దక్కింది. హర్నాజ్‌ కంటే ముందు సుష్మితా సేన్ 1994లో, లారా దత్త 2000 సంవత్సరంలో టైటిల్‌ను దక్కించుకున్నారు.
  • రైతు నిరసనలకు ముగింపు
    రైతు నిరసనలకు ముగింపు
    ఏడాది కాలం పాటు సాగు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్న రైతులు, సాగు చట్టాలు రద్దు కావడంతో సంబరాలు చేసుకుంటూ అదే సమయంలో వారి నిరసనలకు ముగింపు పలికారు
  • ఎయిర్‌ఇండియా టాటా గ్రూప్ వశం
    ఎయిర్‌ఇండియా టాటా గ్రూప్ వశం
    అక్టోబర్ 8వ తేదీన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను పూర్తిగా కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేసి సొంతం చేసుకుంది టాటా గ్రూప్
  • సీడీఎస్ రావత్‌తో పాటు 12 మంది హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి
    సీడీఎస్ రావత్‌తో పాటు 12 మంది హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి
    డిసెంబర్ 8వ తేదీన సీడీఎస్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూనూరులో ప్రమాదంకు గురై కూలింది. ఈ ఘటనలో జనరల్ బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది మృతి చెందారు.
November 2021
  • ట్విటర్ కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్
    ట్విటర్ కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్
    ట్విటర్ కొత్త సీఈఓగా భారతీయ వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. అంతకుముందున్న సీఈఓ జాక్ డార్సీ వారసునిగా పరాగ్ నియమితులయ్యారు. ఐఐటీ బాంబే నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందాడు
  • సాగు చట్టాలు రద్దు
    సాగు చట్టాలు రద్దు
    సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టారు. రైతులు తమపట్టు వీడకపోవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. పార్లమెంటు సమావేశాల్లో సాగుచట్టాలను రద్దు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును పాస్ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఇది తమ విజయంగా చాటుకున్నారు.
  • ఆదిశంకరాచార్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
    ఆదిశంకరాచార్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
    నవంబర్ 5వ తేదీన ప్రధాని మోదీ కేదార్‌నాథ్ పర్యటనలో 12 అడుగుల ఎత్తయిన ఆదిశంకరాచార్య విగ్రహంను ఆవిష్కరించారు. అక్కడే కాసేపు ధ్యానం చేశారు ప్రధాని. మొత్తం 35 టన్నుల బరువున్న ఈ విగ్రహంను ఆదిశంకరాచార్య సమాధి వద్దే నిర్మించారు.2013లో వచ్చిన వరదలకు సమాధి ధ్వంసమైంది.
October 2021
  • కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
    కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
    కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురైన పునీత్.. హాస్పిటల్‌కు చేరుకునే సరికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
  • 100 కోట్లు కోవిడ్ వ్యాక్సిన్ మైలురాయిని తాకిన భారత్
    100 కోట్లు కోవిడ్ వ్యాక్సిన్ మైలురాయిని తాకిన భారత్
    అక్టోబర్ 21వ తేదీనాటికి 100 కోట్లు వ్యాక్సిన్ మైలురాయిని భారత్ తాకింది. చైనా తర్వాత 100 కోట్లు డోసులు ఇచ్చిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది
  • ఐపీఎల్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ కైవసం
    ఐపీఎల్ 2021 చెన్నై సూపర్ కింగ్స్ కైవసం
    ఐపీఎల్ 2021 టైటిల్‌ను ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ గెలిచింది. ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. మొత్తంగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాల్గవ ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం
  • షారుఖ్‌ఖాన్ కుమారుడు అరెస్టు
    షారుఖ్‌ఖాన్ కుమారుడు అరెస్టు
    నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ ను అరెస్టు చేసింది.
September 2021
  • పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చానీ
    పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చానీ
    పంజాబ్ 16వ సీఎంగా చరణ్‌జీత్ సింగ్ చానీ ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఆ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జీత్ కావడం విశేషం. అమరీందర్ కేబినెట్‌లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా
    పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ హైకమాండ్ అమరీందర్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది.2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరీందర్ రాజీనామా పెద్ద చర్చకే దారితీసింది
  • గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
    గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
    గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా హైకమాండ్ రాజీనామా చేయమని చెప్పడంతో ఆయన రాజీనామా చేశారు. రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు.
August 2021
  • యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతి
    యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతి
    ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. మరణించే నాటికి ఆయన వయస్సు 89 సంవత్సరాలు. రాజస్థాన్ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. 1932 జనవరి 5వ తేదీన కళ్యాణ్ సింగ్ జన్మించారు. తొలిసారిగా 1967లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం
    టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం
    నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణపతకం సాధించాడు
  • రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు
    రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు
    క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్‌ చంద్ పేరుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది
  • ఒలింపిక్స్‌ హాకీలో కాంస్యం సాధించిన భారత్
    ఒలింపిక్స్‌ హాకీలో కాంస్యం సాధించిన భారత్
    భారత హాకీ పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది.
  • బాక్సర్ లవ్లీనా బోర్గోయిన్‌కు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం
    బాక్సర్ లవ్లీనా బోర్గోయిన్‌కు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం
    భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోయిన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 69 కేజీ విభాగంలో ఈమె ఈ ఘనత సాధించింది
July 2021
  • కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మయ్
    కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మయ్
    కర్నాటక ముఖ్యమంత్రిగా సీనియర్ బీజేపీ నేత యడియూరప్ప రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. యడియూరప్ప ప్రభుత్వంలో బొమ్మయ్ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు
  • వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చానుకు రజతం
    వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చానుకు రజతం
    ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను చరిత్ర సృష్టించింది. 49 కిలోల విభాగంలో 84 కేజీ 87 కేజీల బరువును ఎత్తి రజత పతకం గెల్చుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
  • రాజ్ కుంద్రా అరెస్టు
    రాజ్ కుంద్రా అరెస్టు
    బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా నీలిచిత్రాలు తీస్తున్నారనే కారణంతో ముంబైలో పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలను ఇప్పిస్తానని చెప్పి యువతులను పోర్న్ వైపు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి
  • అఫ్ఘాన్ గొడవల్లో మృతి చెందిన జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ
    అఫ్ఘాన్ గొడవల్లో మృతి చెందిన జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ
    అఫ్గానిస్తాన్ గొడవల్లో భారతీయ జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ మరణించాడు. ఈయన పులిట్జర్ ప్రైజ్ అవార్డు గ్రహీత. అఫ్గానిస్తాన్‌లో గొడవలను కవర్ చేసేందుకు వెళ్లిన సమయంలో సిద్ధిఖీ మృతి చెందాడు
  • కేంద్ర కేబినెట్ విస్తరణ
    కేంద్ర కేబినెట్ విస్తరణ
    ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు మంత్రులను పదవి నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకున్నారు.
  • లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మరణం
    లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మరణం
    అనారోగ్యంతో లెంజడరీ నటుడు దిలీప్ కుమార్ ముంబైలో మృతి చెందారు. పాకిస్తాన్‌లో జన్మించిన ఆయన దేశ విభజన తర్వాత ముంబైకి చేరుకున్నారు. అనంతరం బాలీవుడ్‌లో ప్రవేశించి సంచలన హీరోగా మారారు
  • ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన స్టాన్ స్వామి మృతి
    ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన స్టాన్ స్వామి మృతి
    ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్‌ స్వామి మృతి చెందారు
  • ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
    ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా పుష్కర్ సింగ్ ధామి
    పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం నాలుగు నెలల్లో ఆ రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా మారారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా అతిపిన్న వయస్కుడు.
  • టోక్యో ఒలింపిక్స్‌లో సింధుకు కాంస్యం
    టోక్యో ఒలింపిక్స్‌లో సింధుకు కాంస్యం
    టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు చెందిన ఏస్ షట్లర్ పీవీ సింధు చైనాకు చెందిన బింగ్ జియావో పై విజయం సాధించి కాంస్య పతకంను సొంతం చేసుకుంది
June 2021
  • తెలంగాణ కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్ర హోం శాఖ ఆమోదం
    తెలంగాణ కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులకు కేంద్ర హోం శాఖ ఆమోదం
    తెలంగాణలో ఉద్యోగాల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతన జోనల్ విధానంలోనూ మళ్లీ మార్పుచేర్పులు చేయగా, వాటికి కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది. తెలంగాణ జోనల్‌ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాద‌న‌ల‌కు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
  • మాజీ మంత్రి ఈటల రాజీనామా
    మాజీ మంత్రి ఈటల రాజీనామా
    మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌కు చేరుకున్న ఈటల రాజేందర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీ కార్యాలయానికి వెళ్లిన స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజీనామా లేఖ అందించారు. రాజ్యంగబద్దమైన ఫార్మాట్‌లో లేఖను ఆయన స్వయంగా అధికారులకు అందించారు.
  • ఇండియాలో బయటపడ్డ ఆ కోవిడ్ వేరియంట్ 'డెల్టా'
    ఇండియాలో బయటపడ్డ ఆ కోవిడ్ వేరియంట్ 'డెల్టా'
    భారత్‌లో గుర్తించిన కోవిడ్ వేరియంట్స్‌కు డబ్ల్యూహెచ్ఓ పేర్లను సూచించింది. కోవిడ్ వేరియంట్ B.1.617.2ను 'డెల్టా' వేరియంట్‌గా,మరో వేరియంట్ B.1.617.1 'కప్పా' వేరియంట్‌గా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇతర కోవిడ్ వేరియంట్స్ B.1.351ని 'బీటా'గా, P.1ని 'గామా'గా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.ఈ మేరకు కోవిడ్ వేరియంట్ల పేర్లను సూచించే పట్టికను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది.
  • భారత్‌లో Eli Lilly
    భారత్‌లో Eli Lilly
    దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయ తీవ్రత తగ్గముఖం పడుతుండగా, మరో శుభవార్త వెలువడింది. కోవిడ్ నియంత్రణకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. మధ్యస్థ, స్వల్ప లక్షణాలున్న కొవిడ్ రోగుల్లో యాంటీబాడీలు పెంపొందించే కాక్ టెయిల్ డ్రగ్ కు భారత్ లో అనుమతి లభించింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన యాంటీబాడీ ఇంజక్షన్లకు దేశంలో ఆమోదం లభించింది.
May 2021
  • ఒడిషా పశ్చిమ బెంగాల్‌లో యాస్ తుఫాను
    ఒడిషా పశ్చిమ బెంగాల్‌లో యాస్ తుఫాను
    ఒడిషా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను యాస్ తుఫాను ఛిన్నా భిన్నం చేసింది. దాదాపు కోటి మంది పై ఈ తుఫాను ప్రభావం చూపింది. అదే సమయంలో 3 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో రూ.20వేల కోట్ల మేరా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు
  • గుజరాత్‌ను అల్లకల్లోలం చేసిన తౌక్టే తుఫాను
    గుజరాత్‌ను అల్లకల్లోలం చేసిన తౌక్టే తుఫాను
    అరేబియన్ సముద్రంలో ఏర్పడ్డ తౌక్టే తుఫాను గుజరాత్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ తుఫాను 174 మందిని పొట్టనబెట్టుకుంది. కేరళ లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురిశాయి.
  • ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్ కన్నుమూత
    ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్ కన్నుమూత
    రాష్ట్రీయ లోక్‌ దల్ (ఆర్ఎల్‌డీ) మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ కోవిడ్‌తో మరణించారు. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు
  • అసైన్డ్ భూములపై జగన్ సంచలనం
    అసైన్డ్ భూములపై జగన్ సంచలనం
    ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు వస్తే.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్‌ భూములకు భారీ ఎత్తున పరిహారం చెల్లించనున్నారు. సాగుభూములుగా రైత్వారీ పట్టా కలిగిన భూముల కంటే 10 శాతం అదనంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. అసైన్డ్‌ భూములంటే ప్రభుత్వం అత్తగారి ఆస్తిలా భావించరాదని, ఎస్సీ ఎస్టీలకు పప్పు బెల్లాలు కొద్ది మొత్తం పరిహారం ఇచ్చి గుంజుకోవడం లాంటివి భవిష్యత్తులో జరగకుండా పేదలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయానికి కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది.
  • పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
    తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
  • కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ శాశ్వతంగా తొలగింపు
    కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ శాశ్వతంగా తొలగింపు
    ట్విటర్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విటర్ పేర్కొంది.
  • మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్
    మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్
    రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్‌ ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. మెదక్‌ జిల్లా అచ్చంపేట గ్రామంలో జమునా హాచరీస్‌ విస్తరణ కోసం అసైన్డ్‌భూములను ఆక్రమించాడని శుక్రవారం ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. ముఖ్యమంత్రి వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, ఇంటెలిజెన్సు డీజీని విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విచారణకు ఆదేశించి 24 గంటలు కాక ముందే ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖను తప్పించారు.
  • 18 ఏళ్లు పైబడిన వారికందరికి వ్యాక్సినేషన్
    18 ఏళ్లు పైబడిన వారికందరికి వ్యాక్సినేషన్
    1 మే నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరూ కరోనా టీకా వేయించుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది. టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని ఇందులో భాగంగా రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి పారిశ్రామిక తయారీదారుల నుంచి టీకాలను కొనుగోలు చేసేదుకు వ్యవస్థను సరళీకృతం చేస్తున్నట్లు ప్రకటించింది.
  • అనంత ఆస్పత్రిలో 10మంది కోవిడ్ పేషెంట్ల మృతి
    అనంత ఆస్పత్రిలో 10మంది కోవిడ్ పేషెంట్ల మృతి
    అనంతపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక జనరల్‌ ఆస్పత్రిలో 10 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు.మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు దిగారు. ఆక్సిజన్ అందకే తమవాళ్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే... అధికారులు మాత్రం సాధారణ మరణాలే అని చెప్పారు
April 2021
  • రఘురామకృష్ణంరాజుకు సీబీఐ కోర్టు ఝలక్‌ -జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్ తిరస్కరణ
    రఘురామకృష్ణంరాజుకు సీబీఐ కోర్టు ఝలక్‌ -జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్ తిరస్కరణ
    వైసీపీ రెబెల్‌ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు అక్రమాస్తుల కేసులో గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణార్హం కాదంటూ సీబీఐ కోర్టు తిప్పిపంపింది.
  • విశాఖ భూములు ఫర్ సేల్
    విశాఖ భూములు ఫర్ సేల్
    ఏపీలో నిధుల వేటలో ఉన్న వైసీపీ సర్కార్‌ ప్రభుత్వ భూముల అమ్మకం కోసం ప్రారంభించిన మిషన్ బిల్డ్‌ ఏపీ ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. పాలనా రాజధానిగా ఎంపికైన విశాఖపట్నంలో విలువైన 18 భూములను కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్‌బీసీసీ సాయంతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వేల కోట్ల రూపాయల్ని ఆర్జించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భూముల వేలం ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎన్‌బీసీసీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ భూముల్ని అభివృద్ధి చేసి అమ్మిపెట్టడం ఎన్‌బీసీసీ బాధ్యత.
  • సుకుమా జిల్లాలో మావోల మెరుపు దాడి
    సుకుమా జిల్లాలో మావోల మెరుపు దాడి
    ఛత్తీసగ్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో గస్తీ కాస్తున్న జవాన్లను మూడువైపుల నుంచి చుట్టుముట్టిన మావోలు కాల్పులు జరిపారు. దీంతో 22 మంది జవాన్లు మృతిచెందారు.
February 2021
  • మొతేరా క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ పేరు
    మొతేరా క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ పేరు
    భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన పింక్‌ బాల్‌ టెస్టుకు గుజరాత్‌లోని మొతెరా స్టేడియం ఆతిధ్యమిచ్చింది.సర్దార్ పటేల్‌ స్టేడియంగా పిలిచే ఈ మైదానాన్ని పలు మార్పులు చేసి నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. భారత్‌లో రెండో పింక్‌బాల్‌ టెస్టుకు ఆతిధ్యమిచ్చిన ఈ స్టేడియాన్నిరాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌షా, ఆయన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
  • టూల్ కిట్ కేసులో సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్టు
    టూల్ కిట్ కేసులో సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్టు
    కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి న్యూఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతు నిరసన దీక్షల్లో సంచలనం చోటు చేసుకుంది. అనూహ్య పరిణామం సంభవించింది. రైతు దీక్షలతో ముడిపడి ఉన్న వివాదాస్పద టూల్ కిట్ వ్యవహారంలో.. దిశ రవి అరెస్ట్ అయ్యారు. గెటా థెన్‌బర్గ్ చేసిన టూల్‌కిట్ వివాదంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
  • ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన గ్లేసియర్లు
    ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన గ్లేసియర్లు
    దేవభూమిగా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లో సరికొత్త ఉత్పాతం చోటు చేసుకుంది. పవిత్ర ధౌలి గంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. నందాదేవి నేషనల్ పార్క్‌ కోర్ జోన్‌లో గ్లేసియర్ విరిగిపడ్డాయి. ఫలితంగా ఈ రెండు నదలు ఉప్పొంగాయి.. మహోగ్ర రూపాన్ని దాల్చాయి. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. దీనితో తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిపోయింది. ఈ ఘటనలో వందలాది మంది కొట్టుకుపోయారు
January 2021
  • హింసాత్మకంగా మారిన రైతు నిరసనలు..రిపబ్లిక్‌ డే రోజున ఎర్ర కోటపై
    హింసాత్మకంగా మారిన రైతు నిరసనలు..రిపబ్లిక్‌ డే రోజున ఎర్ర కోటపై
    దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన సందేశం పంపించామని రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న రైతులు పేర్కొన్నారు. పోలీసు నిర్బంధాలను,లాఠీచార్జిలను చేధించుకుంటూ ఎర్రకోట దాకా వెళ్లిన రైతులు... కోటపై రైతు జెండాను ఎగరవేసి విజయ గర్వంతో నినాదాలు చేశారు. లక్ష్యాన్ని చేరుకునేవరకూ తమను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఎర్రకోట వైపు వందలాది దూసుకొచ్చిన రైతులను నిలువరించలేకపోయిన పోలీసులు... చివరకు టియర్ గ్యాస్,లాఠీచార్జి చేసి అక్కడినుంచి చెదరగొట్టారు.
  • పూణేలోని సీరం ఇన్స్‌టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం
    పూణేలోని సీరం ఇన్స్‌టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం
    పూణేలోని కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూణేలోని మంజరీ ప్రాంతంలో గల సీరం ప్రాంగణంలో నిర్మాణ దశలో ఉన్న సెజ్ 3 భవనంలో నాలుగు, ఐదు అంతస్తులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పది అగ్నిమాపక కేంద్రాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు
  • అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం
    అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం
    అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఆ తరువాత జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జో బిడెన్.. అత్యంత పిన్న వయస్కుడిగా సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తరువాత అత్యధికక వయస్సున్న అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 21 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది.
  • ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా
    ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా
    ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ ‌అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్​ గిల్‌, నయావాల్ ఛెతేశ్వర్‌ పుజారా‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో కెప్టెన్ అజింక్య రహానే చరిత్రను తిరగరాశాడు. తాను సారథ్యం వహించిన ఏ టెస్టులోనూ భారత్ ఓడిపోలేదు.
  • కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభమైంది
    కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభమైంది
    భారతదేశ వ్యాప్తంగా జనవరి 16 శనివారం కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజలకు ఇవ్వాలని తలపెట్టిన ఈ టీకాల కార్యక్రమాన్ని ఒక పారిశుధ్య కార్మికుడితో మొదలుపెట్టారు.మొదటి రోజున మొత్తంగా 1,91,181 మందికి కోవిడ్ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
  • దేశవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభం
    దేశవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభం
    భారతదేశ వ్యాప్తంగా జనవరి 16 శనివారం కరోనా టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనాపై పోరాటంలో భాగంగా 130 కోట్ల మంది ప్రజలకు ఇవ్వాలని తలపెట్టిన ఈ టీకాల కార్యక్రమాన్ని ఒక పారిశుధ్య కార్మికుడితో మొదలుపెట్టారు.మొదటి రోజున మొత్తంగా 1,91,181 మందికి కోవిడ్ టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
  • సాధారణ ప్రజలకు తొలి సారిగా ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది
    సాధారణ ప్రజలకు తొలి సారిగా ఆక్స్‌ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది
    దాదాపుగా ఏడాదిగా పీడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ మరియు బ్రిటీష్ స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా పరిశోధనలు చేసి కోవిషీల్డ్ టీకాను కనుగొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్ పనితీరును జాగ్రత్తగా పరిశీలించిన తరువాతే అనుమతులు ఇవ్వడం జరుగుతోందని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ిండియా డాక్టర్ వీజీ సోమాని తెలిపారు.
  • మాజీ కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ మృతి
    మాజీ కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ మృతి
    మాజీ కేంద్ర మంత్రి, రాజస్థాన్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత బూటా సింగ్ శనివారం కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నలుగురు ప్రధానులతో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అతను హోం వ్యవహారాల మంత్రి (1986-1989), బీహార్ గవర్నర్ (2004-2006) మరియు NCSC (2007-2010) ఛైర్మన్‌గా పనిచేశారు. అతను 2 జనవరి 2021న సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా మరణించారు.
  • ఐక్యరాజ్యసమితిలో రెండేళ్ల పాటు తాత్కలిక సభ్య దేశంగా భారత్ ప్రయాణం ప్రారంభం
    ఐక్యరాజ్యసమితిలో రెండేళ్ల పాటు తాత్కలిక సభ్య దేశంగా భారత్ ప్రయాణం ప్రారంభం
    1 జనవరి 2021లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో భారత్ తాత్కాలిక సబ్యదేశంగా రెండేళ్ల పదవీకాలాన్ని ప్రారంభించింది. మొత్తం 15 దేశాలున్న భద్రతామండలిలో భారత్ 8వ సారి తాత్కాలిక సభ్య దేశంగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. భారత్‌తో పాటు తాత్కాలిక సభ్యదేశాలుగా ఎంపికైన వాటిలో నార్వే, కెన్యా,ఐర్లాండ్, మెక్సికో దేశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సభ్య దేశాలైన ఎస్టోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్ & ది గ్రెనడైన్స్, ట్యునీషియా, మరియు వియత్నాం దేశాల సరసన ఇవి చోటు సంపాదించాయి. ప్రస్తుతం చైనా, రష్యా, యూకే, అమెరికా దేశాలు మాత్రమే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+