వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో సంచలనం: కాంగ్రెస్ ఎమ్మెల్యేతో యడ్యూరప్ప బేరసారాల ఆడియో లీక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మరో బాంబు పేల్చింది. ఇప్పటిదాకా గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప కొడుకుల బేరసారాల ఆడియో టేపులు బయటపెట్టిన ఆ పార్టీ.. ఇప్పుడు ఏకంగా సీఎం యడ్యూరప్ప ఆడియో టేపును బయటపెట్టింది. ఆడియో టేపులో యడ్యూరప్ప బేరసారాలు స్పష్టంగా రికార్డయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ కు మంత్రి పదవితో పాటు ఏ సహాయం కావాలన్నా చేసి పెడుతామని యడ్యూరప్ప అందులో పేర్కొనడం గమనార్హం.

Yeddyurappa caught trying to lure Congress MLA BC Patil

ఆడియో టేపు సంభాషణ యథావిధిగా:

బీసీ పాటిల్: హలో.. హలో.. హలో.. ఫోన్ ఆయనకు ఇవ్వండి(ఫోన్ చేసిన వ్యక్తితో)

యడ్యూరప్ప: హలో

బీసీ పాటిల్: అన్నా నమస్కార, అభినందనలు..

యడ్యూరప్ప: ఎక్కడున్నావ్?

బీసీ పాటిల్: బస్సులో కొచ్చికి వెళ్తున్నాం..

యడ్యూరప్ప: వద్దు.. కొచ్చికి వెళ్లవద్దు. వెనక్కి వచ్చేసేయ్. మేము నిన్ను మంత్రిని చేస్తాం. నీకే సహాయం కావాలన్నా చేసి పెడుతాం.

బీసీ పాటిల్: ఓకె అన్నా.. మీరిప్పుడు చెప్పారు..

యడ్యూరప్ప: సరైన సమయంలోనే నేనేదైనా చేస్తా. అందుకే ఇప్పుడు ఫోన్ కాల్ చేశా. కాబట్టి ఇప్పుడు కొచ్చికి వెళ్లవద్దు. వెనక్కి వచ్చేసెయ్.

బీసీ పాటిల్: కానీ మేము బస్సులో ఉన్నాం..

యడ్యూరప్ప: వద్దు, వెళ్లవద్దు, ఏదో ఒకటి చెప్పి వచ్చెయ్

బీసీ పాటిల్: అయితే నా స్థానమేంటో చెప్పండి

యడ్యూరప్ప: నువ్వు మంత్రివి అవుతావు..

బీసీ పాటిల్: అన్నా.. నాతో పాటు మరో ముగ్గురు ఉన్నారు

యడ్యూరప్ప: వాళ్లను కూడా తీసుకొచ్చెయ్, నాపై నీకు నమ్మకం లేదా?

యడ్యూరప్ప: ఇక వచ్చేయండి, బస్సులో వెళ్లకండి..

బీసీ పాటిల్: ఓకె అన్నా ఓకె..

యడ్యూరప్ప: మీరు గనుక ఒక్కసారి కొచ్చికి వెళ్లారంటే.. ఇక పని అయిపోయినట్టే. మళ్లీ మీరు మాకు చిక్కరు.

బీసీ పాటిల్: ఓకె ఓకె అన్నా..

English summary
Yeddyurappa caught trying to lure Congress MLA BC Patil. The Congress MLA from Hirekerur recorded this incriminating audio which nails Yeddyurappa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X