రోజుకు అయిదుసార్లు అలా చేస్తే చాలు- హిందువుల అమ్మాయిని ఎత్తుకెళ్లినా ఫర్లేదు: బాబా రామ్‌దేవ్
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగ గురు బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోల్చారు. ఇస్లాం, క్రైస్తవంలో ఉన్న ఆ వెసలుబాటు హిందూయిజంలో లేదని పేర్కొన్నారు.
జైపూర్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురు, పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోల్చారు. హిందూయిజంలో లేని కొన్ని ప్రత్యేకతలు ఇస్లాం, క్రైస్తవంలో ఉన్నాయని, ఉదాహరణలతో సహా స్పష్టం చేశారు. అలాంటి వెసలుబాటు హైందవంలో లేదని, అలాంటి వాటిని అసలు ప్రోత్సహించదని కూడా బాబా రామ్ దేవ్ స్పష్టం చేశారు.

ఇస్లాంపై..
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఆయన పర్యటించారు. ధర్మపుజారీ మహరాజ్ మందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకు అయిదుసార్లు నమాజ్ చేసే ఇస్లాం నుంచే అత్యధికులు ఉగ్రవాదులుగా మారారని చెప్పారు. ఒక ముస్లిం.. ఉగ్రవాది అయినా సరే. అతను ఖచ్చితంగా రోజుకు అయిదుసార్లు నమాజ్ చేస్తాడని బాబా రామ్ దేవ్ చెప్పారు.

ఎలాంటి పాపకార్యమైనా..
రోజూ అయిదుసార్లు నమాజ్ చేసి, ఎలాంటి పాపం అయినా చేయొచ్చని ముస్లింలు భావిస్తారని రామ్ దేవ్ అన్నారు. రోజూ అయిదుసార్లు నమాజ్ చేస్తూ ఏ పాపం చేయాలనుకుంటున్నారో అది చేయండి.. హిందువుల అమ్మాయిలను ఎత్తుకుపోయినా ఫర్వాలేదు, జిహాద్ పేరుతో టెర్రరిస్టులుగా మారినా ఇబ్బంది లేదు. మీ మనసుకు నచ్చింది చేయండి.. అని ముస్లింలు భావిస్తారని వ్యాఖ్యానించారు. ఇస్లాం అంటే- రోజూ అయిదుసార్లు నమాజ్ చేయడమేనని వారు నిర్ణయించుకున్నారని అన్నారు.

కొవ్వొత్తి వెలిగిస్తే..
క్రైస్తవంలో చర్చికి వెళ్లి కొవ్వొత్తి వెలిగించడానికి ప్రాధాన్యత ఉందని బాబా రామ్ దేవ్ చెప్పారు. క్రైస్తవ మతం సిద్ధాంతం ప్రకారం- ఏసు క్రీస్తు విగ్రహం ముందు నిల్చుని, కొవ్వొత్తి వెలిగిస్తే అన్ని పాపాలు పరిహారమౌతాయని పేర్కొన్నారు. క్రైస్తవులు శిలువ గుర్తును మెడలో ధరిస్తారని, కొన్ని రకాలు దస్తులు వారి కోసమే తయారయ్యాయని వ్యాఖ్యానించారు. ఇలాంటివి హిందూయిజంలో లేవని, దీన్ని హైందవం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని అన్నారు.

ఖరాన్ చెప్పిందిదే..
తాను ఎవ్వర్నీ విమర్శించట్లేదని, ప్రజలు ఇలాంటి నమ్మకాల వలలో చిక్కుకోవడం ఆందోళనకరమని చెప్పారు. ఒకవర్గం వారు ప్రపంచం మొత్తాన్ని ఇస్లాంలోకి మారుస్తామని, మరొక వర్గం వారు అదే ప్రపంచాన్ని క్రైస్తవంలోకి మారుస్తామని హెచ్చరికలు జారీ చేస్తోన్నారని, అలా చేయడం వల్ల జరిగే పరిణామాలు ఎలాంటివో స్పష్టం చేయడమే తన ఉద్దేశమని బాబా రామ్ దేవ్ చెప్పారు. మరణానంతరం స్వర్గప్రాప్తి సిద్ధించాలంటే పైజామాను ధరించడం, మీసాన్ని కత్తిరించుకోవడం, పొడవాటి గడ్డం పెంచండం, టోపీ పెట్టుకోవాలని ఇస్లాం, ఖురాన్ చెబుతోందని అన్నారు.
హైందవం ఏం చెబుతోంది?
హిందుమతంలో ఇలాంటి వాటికి తావు లేదని బాబా రామ్ దేవ్ అన్నారు. తెల్లవారు జామున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని సనాతన ధర్మం చెబుతోందని గుర్తుచేశారు. ఉదయాన్నే దేవుడి నామస్మరణ చేసి యోగాసనాలు వేయాలని సూచిస్తోందని చెప్పారు. సన్మార్గంలో ఎలా నడచుకోవాలి, సత్ప్రవర్తనలను ఎలా అలవరచుకోవాలనేది హిందూ ధర్మం నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షించాలని, హింసకు, అబద్ధాలకు ప్రజలు దూరంగా ఉండాలని హైందవం సూచిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications