పాక్ వెళ్లిపోండి, పిలిచేందుకు పెళ్లి కాదు: సాధ్వి ప్రాచి
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగాను వ్యతిరేకించేవారు స్వేచ్ఛగా పాకిస్థాన్‌కు వెళ్లి పోవచ్చునని ఓ దిన పత్రికతో మాట్లాడుతూ చెప్పారు.
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అనారోగ్య కారణాల వల్లే ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనలేదన్న బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరగా.. ఆమె మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆహ్వానం పంపడానికి ఇది ఒక రాజకీయ నాయకుడి కూతురి వివాహం కాదన్నారు.

యోగాను వ్యతిరేకించే వారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు. యోగా చేయడాన్ని అఖిల భారత ముస్లీం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. మరోవైపు, అంతకుముందు సూర్య నమస్కారాలను వ్యతిరేకించే వారు సముద్రంలో దుకాలని బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications