యూపీలో వేగంగా విస్తరిస్తుున్న కోవిడ్-ఆస్పత్రులకు యోగీ సర్కార్ కీలక ఆదేశాలు...
ఉత్తర్ ప్రదేశ్ లో కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఢిల్లీలో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం యూపీపైనా పడుతోంది. దీంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగి నాలుగురెట్లయింది. దీంతో యోగీ సర్కార్ ఉలిక్కిపడింది.
యూపీలో మార్చి 18న కేవలం 74 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ మార్చి 28 నాటికి ఇవి కాస్తా పెరిగి 340కి చేరుకున్నాయి. నిన్న ఉదయానికి మాత్రం కాస్త తగ్గి 286కు చేరుకున్నాయి. కానీ 24 గంటల్లో మళ్లీ 17 యాక్టివ్ కేసులు వచ్చాయి.
దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అధికారులతో పాటు ఆస్పత్రులకూ కీలక ఆదేశాలు ఇచ్చారు. శ్వాసకోస సమస్యలతో వచ్చే వారిని నిశితంగా పరీక్షించాలని, అలాగే కోవిడ్ శాంపిల్స్ సేకరణ భారీగా పెంచాలని ఆదేశించారు. ఎక్కువ కేసులు వస్తున్న చోట సేకరించిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్స్ కు పంపాలని కూడా సూచించారు.

నిన్నటివరకూ చూస్తే రాష్ట్రంలో 42 జిల్లాల్లో కనీసం ఓ యాక్టివ్ కేసు నమోదైనట్లు అధికారులు నిర్దారించారు. ఘజియాబాద్ జిల్లాలో అత్యధికంగా 58 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ బుద్ధా నగర్ లో 56 కేసులు ఉన్నాయి.
దీంతో అన్ని జిల్లాల్లో వయోవృద్ధులపై నిశితంగా దృష్టిపెట్టాలని, మందులు, పీపీఈ కిట్లు, గ్లోవ్సా్, ఆక్సిజన్ సిలెండర్లు, ఇతర కోవిడ్ సామాగ్రి పూర్తిస్దాయిలో స్టాక్ ఉంచుకోవాలని ఆస్పత్రులకు సూచించారు.
యూపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏప్రిల్ నెల మొత్తం అంటువ్యాధుల నియంత్రణ ప్రచారం నిర్వహించబోతోంది. దీంతో పాటే అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు దస్తక్ పేరుతో మరో ప్రచారం కూడా చేపట్టనుంది. దీన్ని ఏప్రిల్ 17 నుంచి 30వరకూ నిర్వహించాలని సీఎం యోగీ ఆదేశించారు.












Click it and Unblock the Notifications