మీరు వద్దు: బీజేపీ కేడర్‌కు యోగి ఆదిత్యనాథ్ ఝలక్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. యోగి సీఎంగా కావడాన్ని పలువురు వ్యతిరేకించారు. కానీ ఆయన తన దూకుడుతో ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు.

దటీజ్ యోగి స్టైల్!: 150 గంటలు, ఒక్క క్యాబినెట్ భేటీ లేకుండానే 50 నిర్ణయాలు!

ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న యోగి ఆధిత్యనాథ్.. తాజాగా బీజేపీ నేతలకు షాకిచ్చే విషయాన్ని చెప్పారు. బీజేపీ శ్రేణులు ఎవరు కూడా ప్రభుత్వ కాంట్రాక్టర్ పనులు తీసుకోవద్దని సూచించారు. అయితే ఆ పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, తప్పులేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తక్షణమే చర్యలు తీసుకుంటానన్నారు.

అధికారం ఉందని విర్రవీగకూడదు

అధికారం ఉందని విర్రవీగకూడదు

యోగి ఆదివారం బీజేపీ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు వచ్చాయని విర్రవీగకూడదని, అధికారం.. మనల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనానికి సూచిక అని మంత్రుల్ని ఉద్దేశించి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం పార్టీ, కార్యకర్తల బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ప్రజలు బీజేపీపై అమిత విశ్వాసాన్ని ఉంచారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

2019 లోకసభ ఎన్నికలకు పార్టీ ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని యోగి పిలుపిచ్చారు. కేంద్రం సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తి దాకా అందాలని, అర్హులకు వాటి ప్రయోజనాలు అందితీరాలన్నారు.

విద్యుత్ కోతలే ఉండవు

విద్యుత్ కోతలే ఉండవు

యూపీలో నాలుగు పవిత్ర నగరాలకు 24 గంటలూ కరెంటు సరఫరా చేయాలని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య, వారణాసి, మధుర, గోరక్‌పూర్‌లలో ఇక విద్యుత కోతలే ఉండవని రాష్ట్ర విద్యుత్ మంత్రి శ్రీకాంత శర్మ స్పష్టం చేశారు. ఈ జిల్లాలకు భారీసంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని శనివారం తెలిపారు. బీపీఎల్‌ కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్‌ ఇస్తామని, డబ్బు లేక కరెంటు కనెక్షన్‌ తీసుకోలేదన్న ప్రశ్నే తలెత్తదని చెప్పారు.

స్వచ్ఛ యూపీ కోసం..

స్వచ్ఛ యూపీ కోసం..

ప్రభుత్వ కార్యాలయాల్లో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది పొగాకు, గుట్కా, పాన్‌ నమలరాదని సీఎం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన ఓ పోలీసు అధికారిపై వేటుపడింది. బరైలీ జిల్లా మదియా పోలీసు స్టేషన్‌ అధికారి నగేశ్‌ మిశ్రా శనివారం స్వచ్ఛ భారతపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ సందర్భంగా పొగాకు నములుతూ కనిపించడంతో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు. మరోవైపు, ముజఫర్‌నగర్‌లో గోవధ ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేశారు. వారి ఇంటి నుంచి 26 కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

యోగి ఆధిత్యనాథ్

యోగి ఆధిత్యనాథ్

యోగి ఆధిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తన దూకుడు చూపిస్తున్నారు. మహిళల రక్షణ కోసం యాంటీ రోమియో టీంలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్కా, పాన్, పాలిథీన్ కవర్లు నిషేధించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సిటిజన్స్ చార్టర్ ఏర్పాటు చేశారు. ప్రతి నెల ప్రతి శాఖ అభివృద్ధి పనులపై నివేదిక అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఫైళ్లను ఇంటికి తీసుకు వెళ్లడాన్ని నిషేధించారు. అధికారులు, మంత్రుల ఆస్తుల వివరాలు అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో టీ షర్ట్‌లు వేయకుండా నిషేధించారు. అత్యవసర సమయంలో తప్ప టీచర్లు ఫోన్ వాడకంపై నిషేధం విధించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ ఏర్పాటు చేశారు. అక్రమ కబేళాలపై బ్యాన్ వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Uttar Pradesh Chief Minister Adityanath Yogi on Sunday asked all BJP office bearers and public representatives not to undertake any contractual work and instead monitor them for effective execution.
Please Wait while comments are loading...