అఖిలేష్ ఫోటోలు ఉన్నా ఓకే: దటీజ్ యోగి! అనూహ్య నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతోంది. ఆయన నిర్ణయాలకు దటీజ్ యోగి! అంటున్నారు. తాజాగా ఆయన మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన తాజా నిర్ణయంతో నయా పొలిటికల్ లీడర్ అంటారు.

సీఎంగా యోగి ఆదిత్యనాథ్ మరో 'అతిపెద్ద' సంస్కరణ, రాత్రికి రాత్రే..

మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పేరుతో ఉన్న వేలాది పాఠశాల బ్యాగులను విద్యార్థులకు పంచాలని నిర్ణయించారు. సాధారణంగా ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే పాత సీఎం పేరుతో ఉన్న వేటీని కూడా ఉపయోగించేందుకు ఇష్టపడరు.

డబ్బు వృథా చేయడం ఇష్టం లేక.. ఈగో లేకుండా..

డబ్బు వృథా చేయడం ఇష్టం లేక.. ఈగో లేకుండా..

కానీ యోగి మాత్రం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ధనం వృథా చేయడం ఇష్టం లేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈగోలను పక్కన పెట్టి మాజీ సీఎం అఖిలేష్ ఫోటోలతో ముద్రించి ఉన్న బ్యాగులను విద్యార్థులకు పంచాలని నిర్ణయించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

పాఠశాలల ప్రారంభానికి ముందే..

పాఠశాలల ప్రారంభానికి ముందే..

అఖిలేష్ యాదవ్ ఫోటోలతో ఉన్న బ్యాగులను విద్యార్థులకు పంచాలని యోగి ఆదిత్యనాథ్ అనుమతి ఇచ్చారు. పాఠశాల ప్రారంభానికి ముందే వీటిని విద్యార్థులకు అందించాలని ఆయన ఆదేశించారు.

ఆ తర్వాత కూడా యోగి పేరు ఉండదు

ఆ తర్వాత కూడా యోగి పేరు ఉండదు

అఖిలేష్ ఫోటోలు ఉన్న స్కూల్ బ్యాగులు పూర్తిగా అయిపోయాక.. ముఖ్యమంత్రి యోజన కింద లేదా ఉత్తర ప్రదేశ్ యోజన కింద బ్యాగులు ఉండాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చే వాటి పైనా తన పేరు లేకుండా.. కేవలం సీఎం లేదా యూపీ పేరు ఉండాలని యోగి నిర్ణయించారు. వ్యక్తుల పేరు మీద వద్దని ఆయన భావిస్తున్నారు.

35వేల బ్యాగులు..

35వేల బ్యాగులు..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత మార్చి నెలలో అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉండగా ఆయన ఫోటోలతో 35వేల స్కూల్ బ్యాగులను ముద్రించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది.

ఎన్నికలకు ముందు అఖిలేష్ విచ్చలవిడిగా..

ఎన్నికలకు ముందు అఖిలేష్ విచ్చలవిడిగా..

పరిపాలన చివరి రోజుల్లో అఖిలేష్ యాదవ్ విచ్చలవిడిగా పథకాలు ప్రకటించారు. తన పార్టీ పేరు అయిన సమాజ్‌వాదిని అన్ని పథకాలకు ఉపయోగించారు. సమాజ్ వాది స్మార్ట్ ఫోన్, సమాజ్ వాది నమక్.. ఇలా పలు పథకాలను గుప్పించారు. ఈ పథకాలను సమీక్షించిన సీఎం యోగి.. ఏ పథకానికి కూడా వ్యక్తుల పేర్లు లేదా పార్టీల పేర్లు పెట్టవద్దని నిర్ణయిచారు. ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలని నిర్ణయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
To Save Money, UP Chief Minister Yogi Adityanath Distributes Akhilesh Yadav Schoolbags.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి