వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ తలాక్‌పై యోగి ఆదిత్యానాథ్ సంచలనం

ట్రిపుల్ తలాక్‌పై యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. ట్రిపుల్ తలాక్‌పై మౌనం తనకు ద్రౌపది మానభంగం దృశ్యాన్ని గుర్తుకు తెస్తోందని అన్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: ట్రిపుల్ తలాక్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. ట్రిపుల్ తలాక్‌పై మౌనం వహించడదం ద్రౌపది మానభంగం వంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ స్వస్తి పలకాలని, దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ఆయన అన్నారు.

ట్రిపుల్ తలాక్‌పై ప్రజలు మౌనం వహించడాన్ని చూస్తే తనకు మహా భారతంలోని కథ గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు. రాజసౌధంలో దీనికి బాధ్యులు ఎవరని ద్రౌపడి అడుగుతుందని, ఈ నేరానికి బాధ్యులెవరని అడుగుతుందని అంటూ అది నేరగాళ్ల బాధ్యత అని, ఆ సంఘటనను బలపరిచినవారు నిందితులని, మౌనం వహించినవాళ్లు బాధ్యులని విదురు చెప్పినట్లు ఆదిత్యానాథ్ అన్నారని ఎన్డీటివీ రాసింది.

Yogi Adityanath equates silence on triple talaq to Draupadi's humiliation

ట్రిపుల్ తలాక్ సమస్యను భువనేశ్వరి బిజెపి కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ - ముస్లిం మహిళలకు తాము న్యాయం చేస్తామని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను తాను వ్యతిరేకిస్తున్నట్లు సూచనప్రాయంగా చెబుతూ సాంఘిక దురాచారాలు ఉన్నాయని, సమాజం మేల్కొని బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నించాలని అన్నారు.

ఆ విషయంపై ముస్లిం సమాజంలో వైరుధ్యాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. మోడీ మాట్లాడిన విషయాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాకు వెళ్లించారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Monday called for an end to the practice of triple talaq, and advocated the implementation of a Uniform Civil Code across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X