Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yogi Adityanath : నాలుగేళ్లలో యూపీలో ట్రిలియన్ ఎకానమీ-యోగీ ఆదిత్యనాథ్ తాజా టార్గెట్..

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునే దిశగా వ్యూహాత్మక అడుగులేస్తోంది. యూపీలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్నసందర్భంగా భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించిన యోగీ సర్కార్.. ఇప్పుడు వాటిని అందిపుచ్చుకుని ఆర్ధిక వ్యవస్ధను పరుగులు తీయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో ఆర్ధిక వ్యవస్ధను ట్రిలియన్ స్ధాయికి (రూ.82 లక్షల కోట్లు)కు తీసుకెళ్లేందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్లాన్ సిద్ధం చేశారు.

వచ్చే నాలుగేళ్లలో ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్ధను సాధించే లక్ష్యంతో 10 కీలక రంగాలపై ఫోకస్ పెట్టాలని సీఎం యోగీ నిర్ణయించారు. ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి కీలకమైన ఈ పది రంగాల్లో శాంతిభద్రతలు, వ్యవసాయాభివృద్ధి, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ, పట్టణాభివృద్ధి, విద్య, వైద్యం, పర్యాటకం, రెవెన్యూ ఉన్నాయి. తాజాగా పెట్టుబడుల సదస్సులో రూ.35 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.6.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.

yogi adityanath focus on trillion economy goal in UP in next four years

వచ్చే నాలుగేళ్లలో ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చేలా పది రంగాలు పుంజుకునేలా ప్రతీ రంగానికీ ఓ అదనపు కార్యదర్శి స్ధాయి అధికారుల్ని యోగీ నియమించారు. ఈ పది రంగాల అభివృద్ధి కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేయాలని యోగీ ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లూ ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశంలోనూ ఆర్ధిక వ్యవస్ధలన్ని కుదేలయ్యాయని, కానీ యూపీ మాత్రం 16.8 శాతం వృద్ధి రేటు నమోదు చేసుకుందని యోగీ సర్కార్ చెబుతోంది. అలాగే జాతీయోత్పత్తిలో 8 శాతం యూపీ నుంచే ఇస్తున్నట్లు కూడా చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+