యోగీ సర్కార్ కు అరుదైన ప్రశంస-కోవిడ్ ఎదుర్కొన్న తీరుపై యునిసెఫ్ ఫిదా..

యూపీలో తాజాగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ అభివృద్ధిని పరుగులు తీయించే క్రమంలో బిజీగా ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ యూపీ నుంచి మరోసారి బీజేపీకి అత్యధిక సీట్లు ఇప్పించేందుకు యోగీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆయనకు ఓ అరుదైన ప్రశంస లభించింది. అది అభివృద్ధి సంబంధించినది మాత్రం కాదు. పాలనకు సంబంధించింది కావడం విశేషం.

దేశం మొత్తాన్ని రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ స్పందించిన తీరు అప్పట్లో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు యునిసెఫ్ కూడా అదే విషయాన్ని చెబుతూ ప్రసంశలు కురిపించింది. ఇవాళ యోగీ ఆదిత్యనాథ్ తో భేటీ అయిన యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే యోగీ సర్కార్ అప్పట్లో కోవిడ్ ను ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు.

Cynthia McCaffrey yogi adityanath

ఇప్పటికే సామాజిక ఆరోగ్యం, మహిళల సాధికారత, కోవిడ్ నిర్వహణ విషయంలో యోగీ సర్కార్ ప్రదర్శనను యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే మెచ్చుకున్నారు. అంతే కాదు యూపీ ప్రభుత్వానికి కావాల్సిన సాంకేతిక, అకడమిక్ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యోగీ ఆరేళ్ల పాలనలో యూపీలో గర్భవతులు, శిశువుల మరణాల రేటు భారీగా తగ్గిందని ఆమె పేర్కొన్నారు. అలాగే మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందుతున్నట్లు ఆమె వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+