యోగి వార్నింగ్, చమత్కారం: 'లోకల్' గ్యాంగ్ లీడర్లకు ఆదిత్యనాథ్ షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. తద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

చదవండి: యోగి ఈ నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు

ఇటీవల లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో నేతలకు సలహాలు ఇస్తూనే వారితో సరదా వ్యాఖ్యలు చేశారు. యూపీలో ప్రతిపక్షాలు తన గురించి కలవరపడుతున్నాయని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానిచారు. వారు తనను ఎదుర్కొవడానికి ఏకం కావాలనుకుంటున్నారని చెప్పారు.

కార్యకర్తలతో యోగ చమత్కారం

కార్యకర్తలతో యోగ చమత్కారం

ఓ నమూనా వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా ముఖ్యమంత్రిని చేశారని చర్చించుకుంటున్నారని యోగి కార్యకర్తలతో చమత్కరించారు. యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.

 అఖిలేష్‌పై సెటైర్లు

అఖిలేష్‌పై సెటైర్లు

గతంలో అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్‌పై యోగి విమర్శలు చేశారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఎప్పుడూ సందడిగా ఉంటోందని, అయితే అప్పట్లో మధ్యాహ్న భోజన సమయం అనంతరం ఇక్కడ అలాంటి వాతావరణం ఉండేది కాదన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని బీజేపీ నేతలకు హితవు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని బీజేపీ నేతలకు హితవు

బీజేపీ నేతలు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని యోగి హితవు పలికారు. వాటిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

స్వచ్ఛభారత్ చేపట్టాలని..

స్వచ్ఛభారత్ చేపట్టాలని..

మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు పూలదండలు, బొకేలతో స్వాగతం పలకడంలాంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. వీటికి బదులు ఆ ప్రాంతంలో అందరూ కలిసి స్వచ్ఛభారత్‌ చేపట్టాలన్నారు.

గ్యాంగ్‌స్టర్లను స్థానిక జైళ్ల నుంచి తరలింపు

గ్యాంగ్‌స్టర్లను స్థానిక జైళ్ల నుంచి తరలింపు

మరోవైపు, యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని జైళ్లలో ఉన్న దాదాపు వందమంది గ్యాంగ్‌స్టర్‌లను (బాహుబలి) యోగి స్థానిక జైళ్ల నుంచి ఇతర జైళ్లకు తరలించారు. జైళ్లలో ఉన్న రౌడీలకు స్థానికంగా నెట్ వర్క్ ఉంటుంది. దీంతో వారు జైళ్లలో ఉన్నా చక్రం తిప్పుతారు. దీనిని రూపుమాపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తరలించిన వారిలో..

తరలించిన వారిలో..

ముక్తార్ అన్సారీ, మున్నా బజ్‌రంగి, అతిక్ అహ్మద్, శేఖర్ తివారీ, మౌలానా అన్వరుల్ హక్, ముఖిమ్ అలియాస్ కాలా, ఉదయబాన్ సింగ్ అలియాస్ డాక్టర్, తితు అలియాస్ కిరణ్ పాల్, రిక్కీ అలియాస్ కాకి, ఆలమ్ సింగ్ తదితర గ్యాంగ్ స్టర్‌లను స్థానిక జైళ్ల నుంచి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Around 100 'bahubalis' or gangsters have been shifted to prisons far away from their home districts in Uttar Pradesh in an attempt by the Yogi Adityanath government to smash their local crime network.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి