Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ సూచించిన వారికే అధ్యక్ష పదవి..!
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ తమ పార్టీలు మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నాలుగు రాష్ట్రాలకు బీజేపీ అధినాయకత్వం కొత్త అధ్యక్షులను నియమించింది. దేశంలో బీజేపీకి అత్యంత ముఖ్యమైన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోనే బీజేపీ మోజారిటీ సీట్లు రావడంతో 2019లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో యూపీ కాషాయదళం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ కూడా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డానిష్ ఆజాద్ అన్సారీ ఢిల్లీలో ప్రత్యేక్షమయ్యాడు.ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని మంత్రి డానిష్ ఆజాద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే యోగిని సంప్రదించకుండానే ఢిల్లీ వెళ్లడా లేక యోగి అనుమతితోనే ఢిల్లీ వెళ్లాడా తెలియరావాల్సి ఉంది.

యూపీలో యోగి ఆదిత్యనాథ్ తనదైన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాడు. అందుకే యూపీలో రెండో సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. యోగి నిర్ణయాలు తీసుకోవడంలో అస్సలు భయపడరని అంటున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి యోగి ఆదిత్యనాథ్ సూచించిన వారికే ఇస్తామని తెలిపారు. యోగి అనుమతితోనే డానిష్ ఆజాద్ ఢిళ్లీ వెళ్లినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications