కొత్త ఇంట్లో పార్టీ కార్యకర్తలను సన్మానించి ఆతిథ్యమిచ్చిన యోగి

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కొత్త ఇంట్లోకి మారారు. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో గల అధికారిక బంగ్లాలోకి ఆయన అడుగుపెట్టారు.ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని ఆయన పిలిచి వారికి ధన్యవాదాలు తెలిపారు.

గొప్ప సన్మానం చేసి గౌరవించారు. గొప్ప విజయాలు అందుతాయని , విజయాలు కూడ పెద్ద పెద్ద బాధ్యతలను తీసుకు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయడం వల్లే ఈ గొప్ప విజయం సాధ్యమైందన్నారు.

yogi adityanath moves into new home, hosts dinner for 'winning team'

పార్టీ విజయం కోసం తెరవెనుక ఉండి వ్యూహలు సిద్దం చేసిన వాటిని అమలు చేస్తూ కీలకంగా పనిచేసిన వ్యక్తులను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ కోసం పనిచేసి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరినీ చూడాలని ఆయన అనుకొన్నారు.

ఈ మేరకు ఆయన అందరికీ అతిథ్యం ఇచ్చారు.యోగి ఆహ్వానించినవారిలో సీనియర్ మంత్రులు, ఆయన కేబినెట్ లోని డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడ పాల్గొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అవినీతికి దూరంగా ఉండాలని ఆయన మంత్రులకు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
uttar pradesh Chief Minister yogi adityanath held a thanksgiving feast for bjp leaders at his official residence in lucknow on Wednesday after the party's massive victory in the assembly elections in Uttar Pradesh.
Please Wait while comments are loading...