వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేవ చేయడమే యోగికి ఆధిత్యనాథ్ కు ఇష్టం, కుటుంబసభ్యులు, మద్దతుదారుల హర్షం

గోరఖ్ పూర్ ఎంపి , మఠాధిపతి అయిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతుండడంతో ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:గోరఖ్ పూర్ ఎంపి , మఠాధిపతి అయిన యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతుండడంతో ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ ను బిజెపి ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతరులు నిర్వహించిన చర్చల్లో యోగి ఆదిత్యనాధ్ వైపు మొగ్గుచూపారు.

Yogi Adityanath’s father speaks up, says son ‘always sought only to serve’

దీంతో యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది.ఈ విషయం తెలిసి వెంటనే యోగి ఆదిత్యనాథ్ కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.చిన్నప్పటి నుండే యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేసేవాడని ఆయన తండ్రి గుర్తు చేసుకొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన సోదరుడు యోగి ఆదిత్యనాథ్ ను బిజిపి ఎంపిక చేసిందని మీడియాలో వచ్చిన వార్తలను చూసి తొలుత ఆశ్చర్యపోయానని తర్వాత ఈ వార్త కరెక్టేనని తెలిసి చాలా సంతోషానికి గురైనట్టుగా ఆయన సోదరి చెప్పారు.

యోగి ఆదిత్యనాథ్ మద్దతుదారులు, ఆయన కుటుంబసభ్యులు బాణ సంచా కాల్పి సంబరాలు చేసుకొన్నారు.ఉత్తరాఖండ్ యమకేశ్వర్ లోని పంచూర్ లోని యోగి స్వగృహంలోనూ ఆనందోహత్సాహులు నెలకొన్నాయి. యోగి ప్రస్తుతమున్న గోరఖ్ పూర్ లో కూడ ఆయన మద్దతుదారులు పార్టీ కార్యకర్తలు యోగికి మద్దతుగా సంబరాలు నిర్వహించుకొన్నారు.

English summary
Even as Yogi Adityanath gets set to take the reigns of the Uttar Pradesh government as its newest chief minister after emerging the surprise choice of the Bharatiya Janata Party (BJP) that was unanimously endorsed by the legislative party meet in Lucknow on Saturday, the man’s family is ecstatic and has revealed that they have been following the events with rapt attentions as they unfolded yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X