లక్నోను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చబోతున్న ట్రిపుల్ ఇంజన్ సర్కార్-యోగీ ఆదిత్యనాథ్ వెల్లడి..
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికార పీఠం అధిష్టించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. పాలనపై తన మార్కు ఉండేలా చూసుకుంటున్నారు. అదే సమయంలోనూ అభివృద్ధి విషయంలోనూ ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అయోధ్య, మధుర వంటి నగరాలను ప్రపంచ స్ధాయి నగరాలుగా మారుస్తున్న యోగీ.. ఇప్పుడు రాజధాని లక్నోను సైతం అదే స్ధాయిలో అభివృద్ధి చేసేందుకు సిద్దమవుతున్నారు.
లక్నోను వరల్డ్ క్లాస్ సిటీగా అభివృద్ధి చేయబోతున్నట్లు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ప్రకటించారు. యూపీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ లక్నోను వరల్డ్ క్లాస్ సిటీగా మార్చబోతోందన్నారు. యూపీ స్ధానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్నోలని డాలిగంజ్ మార్కెట్ లో యోగీ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడి నుంచి బీజేపీ మేయర్ అభ్యర్ధి సుష్మా ఖరక్వాల్ తో పాటు పలువురు పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు.

లక్నో నగరం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వంటి పలువురు గొప్ప వ్యక్తులు ప్రాతినిధ్యం వహించారని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ఇప్పుడు ఈ నగరం ప్రపంచ స్ధాయి అభివృద్ధిని చూసే క్రమంలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తోడవుతోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రోత్సహిస్తున్నట్లు యోగీ గుర్తుచేశారు.
యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగీ సర్కార్.. రాష్ట్రంలో మరోసారి తాము విజయం సాధిస్తే ఏం చేయబోతామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో స్ధానిక సెంటిమెంట్లను, డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో యోగీ ప్రయత్నాలకు ప్రజల నుంచి కూడా అదే స్ధాయిలో మద్దతు లభిస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications