"కేజ్రీవాల్ కు యమునా నదిలో మునిగే దమ్ముందా"
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేజ్రీవాల్ సర్కార్ కావాలనే బంగ్లాదేశీయులను, రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తోందని.. వీళ్ల వల్ల దేశానికి ముప్పుందని మండిపడ్డారు. యుమునా నదిని ఆప్ సర్కార్ కలుషితం చేసిందని దుయ్యబట్టారు. దిల్లీలోని మంగోల్ పుర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు.
"ఆమ్ ఆద్మీ పార్టీ క్షమించరాని పాపం చేసింది. బంగ్లాదేశీలు, రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించింది. దిల్లీలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అందుకే ప్రజలు దిల్లీని వదిలి నోయిడా, యూపీలోని పలు ప్రాంతాలకు వెళ్తున్నారు" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

"యమునా నది కలుషితం: ఆప్ సర్కార్ పవిత్ర యమునా నదిని కలుషితం చేసింది. నేను గాజియాబాద్ నుంచి దిల్లీ వస్తున్న క్రమంలో యమునా నదిని చూశాను. ఈనది ప్రజల నమ్మకం, విశ్వాసానికి ప్రతీక. కానీ ఇప్పుడు ఆ నది నుంచి దుర్వాసన వస్తోంది. దీనికి కారణం ఆప్ సర్కార్. కేజ్రీవాల్ కు ఇప్పుడు యమునా నదిలో మునిగే దమ్ముందా..?.. దిల్లీలో బీజేపీ సర్కార్ వస్తేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి" అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ఇక దిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications