యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణం: కేబినెట్లో మైనార్టీకి ఛాన్స్, హాజరైన అఖిలేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు. 47 మందితో ఈయన కేబినెట్ కొలువు తీరుతోంది.

యూపీలో సవాళ్లు: దటీజ్.. యోగి ఆదిత్యనాథ్, బీజేపీయే మోకరిల్లింది!

లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉప్‌వన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో 44 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది. మైనార్టీ మోసిన్ రాజాకు మంత్రి పదవి దక్కింది.

yogi adityanath

ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, గడ్కరీ, వెంకయ్య నాయుడు, శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు హాజరయ్యారు.

యూపీలో 403 స్థానాలకు గాను బీజేపీ 312 సీట్లను సొంతంగా గెలుచుకుంది. దాని మిత్రపక్షాలు అప్నాదళ్‌(ఎస్‌) 9, ఎస్‌బీఎస్‌పీ 4 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో బీజేపీ కూటమి బలం 325కు చేరింది. దీంతో దశాబ్దంన్నర తర్వాత ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత వారం పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ శనివారం శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ ఎంపిక చేసింది.

ఆదిత్యనాథ్‌ యూపీకి 21వ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో బీజేపీ తరపున సీఎం పదవిని చేపట్టిన వారిలో ఆయన నాలుగో వ్యక్తి. ఆయనకు ముందు పార్టీకి చెందిన కల్యాణ్ సింగ్‌, రామ్‌ ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కల్యాణ్ సింగ్‌ రెండుసార్లు ఆ బాధ్యతలను చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi, ex-CM Akhilesh Yadav arrive for Yogi Adityanath’s swearing in ceremony in Lucknow.
Please Wait while comments are loading...