కర్నాటకలో యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం మొదలు-వొక్కళిగల గడ్డలో బీజేపీ తలరాతను మారుస్తారా ?

కర్నాటకలో ఎన్నికల పోలింగ్ కు రెండువారాలే మిగిలున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార వేగం పెంచబోతోంది. ఇందుకోసం ఇవాళ్టి నుంచి యూపీ సీఎం, ఫైర్ బ్రాండ్ నేత యోగీ ఆదిత్యనాథ్ ను రంగంలోకి దింపబోతోంది. కర్నాటకలోని మాండ్యా నుంచి యోగీ తన ప్రచారం ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచే యోగీ ప్రచారం ప్రారంభించడం వెనుక పలు ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. కర్నాటక ప్రచారం కోసం బీజేపీ యోగీని స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో ఇవాళ తొలిసారిగా ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఇవాళ మాండ్యాలో రోడ్ షో, బహిరంగ సభతో ఆయన ప్రచారం ప్రారంభం కానుంది. వొక్కలిగల ప్రభావం ఎక్కువగా ఉండే మాండ్య నుచి యోగీ ప్రచారం ప్రారంభించేలా బీజేపీ ప్లాన్ చేసింది. 2018 ఎన్నికల్లో ఇక్కడి మొత్తం 7 స్ధానాల్ని జేడీఎస్ గెల్చుకుంది. దీంతో ఇప్పుడు యోగీ ఇక్కడ బీజేపీ తలరాతను మారుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

 yogi-adityanath

జేడీఎస్ కంచుకోటగా భావించే మాండ్యలో కాంగ్రెస్ ప్రభావం కూడా గణనీయంగానే ఉంది. దీంతో బీజేపీ ఇక్కడ మూడో స్ధానంలో నిలుస్తోంది. 2018 ఎన్నికల్లో మైసూరు-మాండ్య-చామరాజనగర్ బెల్ట్ లో ఉన్న 22 సీట్లలో కేవలం 4 సీట్లు గెల్చుకున్న బీజేపీ.. ఈసారి దాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఎత్తులు వేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మాండ్యాలోని గెజ్జలగెరెలో డైరీని ఆవిష్కరించి బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారు. దీని తర్వాత మార్చి 12న మాండ్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. అనంతరం ఈ ఒక్కళిగ బెల్ట్‌పై బీజేపీ ఫోకస్ కు కొనసాగింపుగా యూపీ సీఎం యోగీ ఇవాళ ప్రచారం మొదలుపెడుతున్నారు.

వొక్కలిగ బెల్ట్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం వెనుక చాలా కారణాలున్నాయి. సంప్రదాయ వాదిగా పేరొందిన యోగీ... ఆదిచుంచనగిరి మఠం కేంద్రంగా రాజకీయాన్ని రగిల్చేందుకు సిద్ధమవుతున్నారు. మాండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఆదిచుంచనగిరిలో ప్రధాన కార్యాలయంతో పాటు ఒక్కళిగల్లో భారీగా అనుచరులను కూడా కలిగి ఉంది. ఆది చుంచనాగరి మఠానికి నాథ సంప్రదాయానికి ఉన్న ఈ సంబంధాన్ని 2018 ఎన్నికల నుండి బిజెపి వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ ఎత్తులు ఇక్కడ పారడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+