యోగీ కేబినెట్ కీలక నిర్ణయాలు-ఓబీసీ కమిషన్ నివేదిక ఆమోదం-సుప్రీం అనుమతి కోసం పోరు

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా సమావేశమైన యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా సమావేశమైన యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో కీలకమైన ఓబీసీ కమిషన్ నివేదిక కూడా ఉంది. ఈ నివేదికను ఆమోదించడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఓబీసీ కోటా అమలుకు యోగీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఈ వివాదానికి కేబినెట్ నిర్ణయం కీలక మలుపు అయ్యే అవకాశం ఉంది.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిషన్ సిఫారసును యూపీ కేబినెట్ ఆమోదించింది. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశంపై అత్యవసర విచారణ కోరేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో27 శాతం ఓబీసీ కోటా అమలు కోసం యోగీ సర్కార్ గతంలో చేసిన ప్రయత్నాల్ని హైకోర్టు అడ్డుకుంది. 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన "ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా"ను రాష్ట్రం అనుసరించకపోవడాన్ని బట్టి ఈ తీర్పు వెలువడింది. దీంతో ప్రభుత్వం ఓబీసీ కమిషన్ ను నియమించింది. ఓబీసీ కమిషన్ సుదీర్ఘ పరిశీలన తర్వాత తయారు చేసిన రిపోర్ట్ ను కేబినెట్ ఆమోదించింది.

 yogi adiyanath cabinet approves obc commission report-paves the way for quota in municipal polls

రాష్ట్రంలో ఓబీసీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు, ముఖ్యంగా విపక్ష ఎస్పీకి అండగా ఉన్న వర్గాల్ని తమవైపు తిప్పుకునేందుకు యోగీ ఆదిత్యనాథ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కేబినెట్ నిర్ణయానికి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంటే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. ఇందుకోసం సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+