వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగివా? చౌకీదార్‌వా? యూపీ సీఎంకు మాయావతి చురకలు

|
Google Oneindia TeluguNews

లక్నో : గత సార్వత్రిక ఎన్నికల్లో చాయ్‌వాలా పదం ఎంత పాపులర్ అయిందో ఇప్పుడు మై బీ చౌకీదార్ పదం కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. మోడీ ప్రారంభించిన చౌకీదార్ క్యాంపెయినింగ్‌తో బీజేపీ నాయకులంతా తమ పేరుకు ముందు చౌకీదార్ పదాన్ని చేర్చుకుంటున్నారు. అయితే బీజేపీపై విమర్శలకు ప్రతిపక్షాలు ప్రస్తుతం చౌకీదార్ పదాన్నే అస్త్రంగా చేసుకుంటున్నాయి.

చౌకీదార్ నిజాయితీ ఉంటే అప్పీల్ చేయు : సంజౌతా ఎక్స్ ప్రెస్ తీర్పుపై ఓవైసీచౌకీదార్ నిజాయితీ ఉంటే అప్పీల్ చేయు : సంజౌతా ఎక్స్ ప్రెస్ తీర్పుపై ఓవైసీ

యోగివా? చౌకీదార్‌వా?
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ మాయవతి బీజేపీ ప్రారంభించిన మై బీ చౌకీదార్ క్యాంపెయిన్ పై సటైర్లు వేశారు. తన పేరుకు ముందు చౌకీదార్ పదాన్ని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పించారు. ఆదిత్యనాధ్ తాను యోగా లేక చౌకీదారా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారని బెహన్ జీ ఎద్దేవా చేశారు. తన పేరుకు ముందు ఏ పదాన్ని చేర్చుకోవాలో తేల్చుకోలేకే ఆయన చౌకీదార్ యోగి పదాలు రెండింటిని పెట్టుకున్నారని అన్నారు. బీజేపీ నేతలు తమ పేరుకు ముందు ఏ పదాలు చేర్చుకున్నా దేశ ప్రజలకు అభ్యంతరం లేదని, అయితే తమకు రాజ్యాంగబద్దమైన, చట్టబద్ధమైన పాలన అందించాలని మాత్రమే వారు కోరుకుంటున్నారని మాయావతి ట్వీట్ చేశారు.

Yogi Or Chowkidar Chief Ministers Big Dilemma! Mayawati Trolls BJP

కేసులు మూయించుకోవడంలో బీజేపీ నేతలు బిజీ
బీజేపీ అధికారం చేపట్టిన రెండేళ్లలో ఉత్తర్ ప్రదేశ్ లో క్రైం రేటు బాగా తగ్గిందన్న సీఎం యోగి వ్యాఖ్యలు మాయావతి తప్పుబట్టారు. ఈ రెండేళ్లుగా బీజేపీ నాయకులు, మంత్రులు తమపై ఉన్న కేసుల్ని మూయించుకునే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. క్రైం రేటు తగ్గిందని చెబుతున్న బీజేపీ నేతలు, తాము అధికారంలోకి వచ్చాక యూపీలో జరిగిన మూక దాడుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న విషయాన్ని మాయావతి గుర్తు చేశారు. రాఫెల్ డీల్ డాక్యుమెంట్ల చోరీ విషయంలో కేంద్రం వైఖరిని బెహన్ జీ తప్పుబట్టారు. రహస్య ఫైళ్లను కాపాడలేని నాయకులు తాము దేశానికి చౌకీదార్లమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

English summary
BSP chief Mayawati, the BJP's bitter rival in Uttar Pradesh, today trolled the party over its recently launched "Main Bhi Chowkidar" campaign. She also took a sharp jibe at Chief Minister Yogi Adityanath as she claimed that he was confused as to what prefix to add before his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X