శుభవార్త: ఆ చెక్‌బుక్‌లు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తన కస్టమర్లకు ఎస్‌బిఐ శుభవార్త అందించింది. ఎస్‌బిఐలో విలీనమైన బ్యాంకులకు చెందిన చెక్‌బుక్‌లు డిసెంబర్ 31, 2017 వరకు చెల్లుబాటు అవుతాయని ఎస్‌బిఐ ప్రకటించింది.

భారతీయ మహిళా బ్యాంకుతో సహా ఎస్‌బీహెచ్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ తదితర అనుబంధ బ్యాంకులు జారీచేసిన చెక్కులేవీ సెప్టెంబర్‌ 30 తర్వాత చెల్లబోవంటూ జారీచేసిన ఆదేశాలపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వెనక్కి తగ్గింది

You can now use cheque books of SBI's former associate banks till December 31

. అసోసియేట్‌ బ్యాంకుల చెక్కుల వాలిడిటీని 2017 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్టు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అప్పటి వరకు కొత్త ఎస్‌బీఐ చెక్‌ బుక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బిఐ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

హోమ్‌ బ్రాంచ్‌ను సందర్శించి లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం ద్వారా కొత్త చెక్‌ బుక్కులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఎస్‌బీఐలో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌ బుక్కులు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు సెప్టెంబర్‌ 30 వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త వాటికే అనుమతిస్తామని ఎస్‌బీఐ ఇంతకుముందు ప్రకటించింది.

అయితే పోస్టు డేటెడ్‌ చెక్కులు తీసుకున్న వారి పరిస్థితి దారుణంగా మారడంతో, ఎస్‌బీఐ ఈ నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గింది. ఆ గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The cheque books of State Bank of India’s (SBI) former associate banks will be valid till December 31 after the earlier deadline of September 30 was extended.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి