పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! ఇకనుంచి వాటి అవసరం లేదు!!
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గురువారం తన ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. అనారోగ్యం పాలైనపుడు చికిత్సకు అవసరమైన నగదు కోసం స్వీయ ప్రకటన సరిపోతుందని వెల్లడించింది.
న్యూఢిల్లీ: తన ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గురువారం ఓ శుభవార్త చెప్పింది. ఖాతాదారులు అనారోగ్యం పాలైనపుడు చికిత్సకు అవసరమైన నగదు కోసం ఇతరత్రా ధ్రువీకరణపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్వీయ ప్రకటన సరిపోతుందని వెల్లడించింది.
ఈ మేరకు ఈనెల 25న కార్మికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకు వైద్య ఖర్చుల కోసం ఖాతాదారులు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి ఆమోదం పొందినట్లు లేఖ లేదా మెడికల్ సర్టిఫికెట్ జత చేయాల్సి వచ్చేది.

తాజా నిర్ణయంతో పీఎఫ్ ఖాతాదారులకు ఆ ఇబ్బందులు తప్పాయి. 'ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖాతాదారులకు మేలు జరగనుంది. ఇకపై తమ ఖాతా నుంచి నగదును పొందడానికి వారు ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు' అని ఈపీఎఫ్‌వో కమిషనర్ వి.పి.జాయ్ చెప్పారు.












Click it and Unblock the Notifications