వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రికార్డ్ నా సొంతం, అంచనాలు తలకిందులు: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

వడోదర: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన వడోదరలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వడోదరలో తనకు వచ్చిన మెజార్టీ దేశంలో ఎవరికీ రాలేదన్నారు. 5.70 లక్షల మెజార్టీ.. ఈ రికార్డ్ తన సొంతమని చెప్పారు.

వడోదర సభలో మోడీ మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం మోడీ...మోడీ.. అంటూ హోరెత్తింది. మోడీ ప్రసంగానికి జనం జేజేలు కొట్టారు.

Narendra Modi

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... దేశానికి ఇది శుభదినమన్నారు. వడోదరను దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా తీర్చి దిద్దుతానని చెప్పారు. తాను ఎక్కడున్న మీకోసం పని చేస్తానని చెప్పారు. బిజెపిని గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజాస్వామ్యానిది, ప్రజలది అన్నారు.

వడోదర ప్రజలకు తాను తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. విజయం కోసం కృషి చేసిన ఎన్డీయే పక్షాలందరికీ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇంతకాలం సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయన్నారు.

కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు బిజెపికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారన్నారు. రాజకీయ పండితుల అంచనాలు అన్నీ తలకిందులయ్యాయన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి స్వతంత్రంగా అధికారం దక్కించుకున్న కాంగ్రెస్సేతర పార్టీ బిజెపియే అన్నారు. ప్రభుత్వాలు ఏ కొందరి కోసమే కాకుండా ప్రజలందరి కోసం పని చేయాలన్నారు.

ప్రజల్లో విశ్వాసం నింపడంలో బిజెపి విజయం సాధించిందన్నారు. దేశం కోసం జైలుకు వెళ్లేందుకు లేదా ప్రాణత్యాగం చేసేందుకు అవకాశం రాకపోయినప్పటికీ.. సురాజ్యం కోసం ముందుకు సాగుదామన్నారు. స్వాతంత్రం వచ్చిన తరవాత జన్మించిన వ్యక్తి తొలిసారి ప్రధాని కాబోతున్నారన్నారు.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi 
 
 arrives in Vadodara, addresses the crowd. Modi said 
 
 that he was here to thank all the people of Vadodara 
 
 who voted for him. "After filing nomination, I have 
 
 been able to give Vadodara barely 50 minutes and you 
 
 have given me 5.7 lakh votes," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X