షాక్: జైల్లో చిప్పకూడు తినడానికి సిద్దంగా ఉండు: దినకరన్ కు సీఎం పళనిసామి వార్నింగ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. చెన్నైలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో శశికళ ఫ్యామిలీ సభ్యులను, టీటీవీ దినకరన్ ను పళనిసామి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

స్పీకర్, పళని, పన్నీర్ భేటీ: రెబల్ ఎమ్మెలేల మీద అనర్హత వేటు ? టెన్షన్ తో రిసార్ట్ లో టీవీ !

శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, టీటీవీ దినకరన్ కలిసి అన్నాడీఎంకే పార్టీని, తమిళనాడు ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించారని, ఆ పప్పులు వుడకలేదని సీఎం పళనిసామి అన్నారు. జయలలిత పార్టీలో తన వారసులను ఎవ్వరినీ నియమించలేదని గుర్తు చేశారు.

10 ఏళ్లు ఎక్కడున్నావ్ ?

10 ఏళ్లు ఎక్కడున్నావ్ ?

కుటుంబ రాజకీయాలకు అన్నాడీఎంకే పార్టీ దూరంగా ఉంటుందని గతంలో ఎంజీఆర్, తరువాత జయలలిత చెప్పిన విషయం పళనిసామి గుర్తు చేశారు. అన్నాడీఎంకే పార్టీ వారసులు మేమే అని చెప్పుకుంటున్న టీటీవీ దినకరన్ కు గత 10 ఏళ్ల నుంచి పార్టీలో కనీసం సభ్యత్వం లేదని, ఇన్ని రోజులు అతను ఎక్కడ ఉన్నాడని పళనిసామి ప్రశ్నించారు.

  Sasikala Wont Be Making Candles In Jail జైల్లో శశికళ దర్జాగా.. | Oneindia Telugu
  అమ్మ మెడపట్టి గెంటేశారు గుర్తుందా !

  అమ్మ మెడపట్టి గెంటేశారు గుర్తుందా !

  జయలలిత నిన్ను మెడపట్టుకుని పార్టీ నుంచి గెంటేశారని, ఆ విషయం దేశం మొత్తం తెలుసని పళనిసామి టీటీవీ దినకరన్ మీద మండిపడ్డారు. త్వరలో జైల్లో చిప్పకూడు తినడానికి టీటీవీ దినకరన్ సిద్దంగా ఉండాలని, పోలీసులు త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తారని పళనిసామి చెప్పారు.

  జయలలిత కాళ్లు పట్టుకున్న శశికళ

  జయలలిత కాళ్లు పట్టుకున్న శశికళ

  శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్వులు అందరన్ని అమ్మ జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి బయటకు గెంటేశారని పళనిసామి అన్నారు. తరువాత శశికళ జయలలిత కాళ్లు పట్టుకుని బోరునవిలపించి పంచన చేరారని, ఒక్క రోజు కూడా అమ్మ పార్టీలో శశికళకు ప్రాధాన్యత ఇవ్వలేదని పళనిసామి గుర్తు చేశారు.

  దినకరన్ తిక్క చేష్టలతో !

  దినకరన్ తిక్క చేష్టలతో !

  ఒక్క వారంలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, ఆ రోజు సీఎంతో సహ పన్నీర్ సెల్వం మూటముళ్లు సర్దుకుని ఇంటికి వెళ్లడానికి సిద్దంగా ఉండాలని, ఇద్దరూ కలిసి చెక్కభజన చేసుకోవాలని శుక్రవారం టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే.

  ఆ దమ్ము మీకుందా

  ఆ దమ్ము మీకుందా


  టీటీవీ దినకరన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్బంలో సీఎం పళనిసామి చెన్నైలో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో గట్టిగానే మన్నార్ గుడి మాఫియాకు వార్నింగ్ ఇచ్చారు. జయలలిత అధికారంలోకి తీసుకు వచ్చిన అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఎవ్వరూ కుప్పకూల్చలేరని, ఆ దమ్ము ఎవ్వరికీ లేదని పళనిసామి ధీమా వ్యక్తం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The message was crisp and clear for TTV Dhinakaran, the expelled deputy general secretary of the AIADMK, from Tamil Nadu chief minister Edappadi K Palaniswami. Dhinakaran says he will send us packing home but he himself is sure to end up soon in prison. Our government is stable.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి