Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో మేడ మీద నుంచి రోడ్డులో చెత్తవేశాడు: యువకుడిని ఇలాగే చంపేశారు !

బెంగళూరు: రోడ్డు మీద చెత్త వేశాడని కోపంతో యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలోని గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గిరినగరలో నివాసం ఉంటున్న దేవరాజ్ (28) అనే యువకుడు హత్యకు గురైనాడు.

గిరినగరలోని పీఇఎస్ కాలేజ్ సమీపంలో దేవరాజ్ నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి దేవరాజ్ మేడ మీద నుంచి రోడ్డు మీదకు చెత్తవేశాడు. ఆ సందర్బంలో రోడ్డు మీద అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ముగ్గురు యువకులు నిలబడి ఉన్నారు.

Young man murdered near pes college in Girinagar in Bangaluru.

రోడ్డు మీద ఎందుకు చెత్త వేశావు అని ముగ్గురు యువకులు దేవరాజ్ ను ప్రశ్నించారు. ఆ సందర్బంలో ఇరు వర్గాల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ముగ్గురు యువకులు దేవరాజ్ నివాసం ఉంటున్న కట్టడం మీదకు వెళ్లారు.

దేవరాజన్ ను పట్టుకుని వెళ్లి చెత్త ఎక్కడి నుంచి వేశాడో అక్కడి నుంచి అతన్ని కిందకు తోసేశారు. తీవ్రగాయాలైన దేవరాజ్ ను ఆసుపత్రికి తరలించగా మరణించాడని అతని కుటుంబ సభ్యులు గిరినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దేవరాజ్ ను దారుణంగా హత్య చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+