ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని.. నిద్రిస్తున్న నవ దంపతులను చంపేశాడు
ఉత్తరప్రదేశ్: తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే నెపంతో తన కూతురుతోపాటు అల్లుడిని హతమార్చాడు ఓ దుర్మార్గపు తండ్రి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
చంద్రబాన్(24), కాజల్(22)లు ఇటీవల వారి ఇష్టం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని కాజల్ తండ్రి ఉత్తమ్ సింగ్ కోపంతో వారు నివాసం ఉండే శ్రీనగర్ ప్రాంతంలోని బిల్‌రాహి గ్రామానికి వెళ్లాడు.

చంద్రబాన్ ఇంటిచి వెళ్లిన అతడు నిద్రపోతున్న కూతురు, అల్లుడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
మావోయిస్టుల బాంబుదాడిలో నలుగురు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం సుకుమా జిల్లా ధర్మపేట వద్ద భద్రతా బలగాలు లక్ష్యంగా బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications