యూపీ తిరంగా యాత్ర: కస్‌గంజ్‌లో తుపాకులతో కాల్పులు జరిపారు
లక్నో: యూపీలోని కస్‌గంజ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తిరంగా యాత్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కొందరు దుండగులు ఈ యాత్రపై దాడికి పాల్పడ్డారని, దీంతో హింసాత్మకంగా మారిందని చెబుతున్నారు.
ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొందరు ఆందోళనకారులు కస్‌గంజ్ పట్టణంలో తుపాకులు, కత్తులు, కర్రలతో హంగామా సృష్టించారు.

కొందరు తుపాకులతో కాల్పులు జరపడాన్ని ఓ కార్యాలయం పై అంతస్తు నుంచి వీడియో తీశారు. ఈ వీడియోలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీడియోల ఆధారంగా ఎవరు కాల్పులు జరిపారు, వారు ఎవరు అని ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, అల్లర్లు రేపే ఆందోళనకారులను అణిచివేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications