బెంగళూరు టెక్కీ కేసులో అనూహ్య మలుపు: మొబైల్ ఫోన్ తో తారుమారు

బెంగళూరులో సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ మహిళా టెక్కీ మృతి చెందిన ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తొలుత ప్రమాదంగా భావించిన ఈ కేసు.. హత్యగా తేలింది. హతురాలి మొబైల్ ఫోనే నిందితుడిని పట్టించడంలో కీలక పాత్ర పోషించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హతురాలి పేరు షర్మిల కుశాలప్ప. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమె స్వస్థలం.. మంగళూరు. ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చి యాక్సెంచర్ లో జాయిన్ అయ్యారు. రామ్మూర్తినగరలో నివాసం ఉంటోన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో ఆమె నివసిస్తోన్న ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షర్మిల మరణించారు. మంటలు చెలరేగిన విషయాన్ని ఇంటి యజమాని విజయేంద్ర తొలుత గుర్తించారు. రామ్మూర్తి నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Young Neighbor Arrested in Bengaluru Techie Murder Case Involving Fire and Evidence Destruction

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షర్మిల మృతదేహాన్ని సస్వాదీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసును మొదట అసహజ మరణం (UDR) గా నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో హత్యకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసును క్లోజ్ చేయాలనే నిర్ధారణకు వచ్చారు.

షర్మిల మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మొబైల్ ఫోన్ ఆన్ అవ్వడంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఫోన్ టవర్ లొకేషన్‌ను పరిశీలించగా, అది షర్మిల ఫ్లాట్‌కు పక్కనే ఉన్న ఇంటిని చూపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, షర్మిల పొరుగునే నివసించే కేరళకు చెందిన 18 సంవత్సరాల పీయూసీ సెకెండ్ ఇయర్ విద్యార్థి కర్నల్ కురాయ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అతను నిజాన్ని వెల్లడించాడు.

కురాయ్ కు షర్మిలతో పరిచయం ఉండేది. తనతో స్నేహంగా ఉంటోండటంతో తనను ప్రేమిస్తున్నట్లు కురాయ్ భావించాడు. ఘటన జరిగిన రాత్రి కురాయ్ తన ఇంటి టెర్రస్ మీదుగా షర్మిల ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు. లోపలికి వచ్చిన వెంటనే షర్మిలతో అనుచితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆకస్మిక దాడితో భయపడిన షర్మిల అతడిని నెట్టివేసి కేకలు వేసింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై దాడి చేసి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

అనంతరం సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా హత్యకు వాడిన దిండు, బెడ్‌షీట్, ఇతర వస్తువులను గదిలో వేసి నిప్పు పెట్టాడు. షర్మిల ఫోన్‌ను తీసుకెళ్లాడు. తన మీద ఎటువంటి అనుమానాలు రాకుండా జాగ్రత్త పడ్డాడు. సీసీటీవీ, కాల్ రికార్డుల ద్వారా తొలుత ఆచూకీ లభించలేదు. మూడు రోజుల తర్వాత షర్మిల ఫోన్‌లో తన సిమ్ వేసి ఆన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి నిందితుడిని పట్టుకున్నారు.

ఆమె మరణానికి పొగ పీల్చడం కారణం కాదని ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టమ్ నివేదికలు సైతం స్పష్టం చేశాయి. అగ్నిప్రమాదానికి ముందే షర్మిల మరణించారని, చేతులపై గాయాలు, పెనుగులాట చిహ్నాలు ఉన్నాయని, అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి ముందు ఆమెను ఊపిరాడకుండా చేశారని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+