Young woman: ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ చేసిన డాక్టర్లు, స్టేట్ మెంట్ ఇచ్చి ప్రాణం వదిలేసిన యువతి !
లక్నో/ ఉత్తరప్రదేశ్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యువతి మీద సామూహిక అత్యాచారం జరిగింది. ఆపరేషన్ థియేటర్ లో తన మీద డాక్టర్లు గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో బాధితురాలు ఫేమస్ ఆసుపత్రి డాక్టర్ల అరాచకాల గురించి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. అత్యాచారానికి గురైన యువతికి వేరే వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలలకం రేపింది.
Recommended Video

పోటాపోటీగా నేరాలు
ఉత్దరప్రదేశ్ లో నేరాలు, ఘోరాలకు ఏమాత్రం కొదవలేదు. ఉత్దరప్రదేశ్ లో అక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే ఆక్కడి వాళ్లు పోటాపోటీగా నేరాలు చేస్తున్నారా ? అనే అనుమానాలు మొదలౌతాయి. ఉత్దరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి మీద ప్రాణం పోసే వైద్యులే గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అనారోగ్యంతో ఆసుపత్రిలో యువతి
ఉత్దరప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ జిల్లాలోని మీర్జాపూర్ లో నివాసం ఉంటున్న యువతి మే 29వ తేదీన అనారోగ్యంతో ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేరింది. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పారని తెలిసింది. వైద్యుల సూచనమేరకు ఆ యువతి ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది.

ఆపరేషన్ థియేటర్ లో గ్యాంగ్ రేప్ ?
జూన్ 1వ తేదీన యువతికి ఆపరేషన్ చెయ్యాలని ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. తరువాత యువతికి ఆపరేషన్ చేసి వేరే వార్డుకు తరలించారు. ఆపరేషన్ థియేటర్ లో తనకు చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు తనమీద సామూహిక అత్యాచారం చేశారని ఆ యువతి ఆమె సోదరుడికి చెప్పింది.

యువతి ప్రాణం పోయింది
విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి చేరుకుని బాధితురాలి దగ్గర స్టేట్ మెంట్ తీసున్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలు చికిత్స విఫలమై మరణించడం కలకలం రేపింది. కేసు విచారణలో ఉందని, ఇంకా ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications