అక్రమ సంబంధం, ఏకాంతంలో ప్రియురాలికి పదేపదే ఫోన్లు, చంపేసి, నిప్పుపెట్టిన ప్రియుడు!

చెన్నై: అక్రమ సంబంధం కారణంగా 30 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన తమిళనాడులోని తూత్తుక్కుడి నగరంలో జరిగింది. ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలికి పదేపదే 10కి పైగా ఫోన్లు రావడంతో సహనం కొల్పోయిన ప్రియుడు కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించి మృతదేహాన్ని దహనం చేశాడు. ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 ఉద్యోగం చేస్తూ పరిచయాలు

ఉద్యోగం చేస్తూ పరిచయాలు

తిరుప్పూర్ జిల్లా పల్లడమ్ ప్రాంతానికి చెందిన సెల్వీ అలియాస్ బేబీ (30) అనే మహిళ తూత్తుకుడిలోని ముత్తయాపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సెల్వీ ఉద్యోగం చేసే సమయంలో అనేక మంది పురుషులతో పరిచయం ఏర్పడింది. పురుషలతో పరిచయం పెంచుకున్న సెల్వీ వారితో అక్రమ సంబంధం సాగిస్తోంది.

సహజీవనం

సహజీవనం

తూత్తుకూడిలోని నేతాజీనగర్ కు చెందిన ఏడ్విన్ తో సెల్వీకి పరిచయం ఏర్పడింది. సెల్వీ, ఎడ్విన్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. తుత్తూకుడిలోని కుమరన్ థియేటర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఎడ్విన్, సెల్వీ సహజీనం చేస్తున్నారు. అదే సమయంలో అదే ప్రాంతినికి చెందిన కొంత మంది పురుషులతో సెల్వీకి పరిచయం ఏర్పడింది.

కొత్త ఇంటికి మకాం

కొత్త ఇంటికి మకాం

ఇటీవల ఎడ్విన్ తో కలిసి నేతాజీనగర్ లో ఇళ్లు ఖాళీ చేసిన సెల్వీ తూత్తుకూడిలోని వివేకానంద్ నగర్ లోని మరో అద్దె ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఎడ్విన్, సెల్వీకి ఇంటిని అద్దెకు తీసిచ్చారు. సెల్వీ ఇంటిలోని వస్తువులు మరో ఇంటికి తరలించడానికి జ్యోతీనగర్ కు చెందిన కరుప్పస్వామి (31) అనే ఆటో డ్రైవర్ లగేజ్ ఆటో తీసుకుని వెళ్లాడు. అదే రోజు రాత్రి ఎడ్విన్ పని మీద వేరే ఊరికి ఒక్కడే వెళ్లాడు.

రాత్రి రహస్యంగా రా!

రాత్రి రహస్యంగా రా!

ఇంటిలోని వస్తువులు తరలించడానికి వెళ్లిన కరుప్పస్వామి సెల్వీ దగ్గర ఆటో అద్దె తక్కువ తీసుకున్నాడు. ఆ సమయంలో కరుప్పస్వామి, సెల్వీకి పరిచయం ఏర్పడింది. ఆటో అద్దె తక్కువ తీసుకున్న కరుప్పస్వామికి సెల్వీ ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చింది. రాత్రి 11 గంటల తరువాత తన ఇంటికి రహస్యంగా రావాలని కరుప్పస్వామికి సెల్వీ చెప్పింది.

 ఏకాంతంగా జల్సాలు

ఏకాంతంగా జల్సాలు

సెల్వీ ఇంటికి వెళ్లిన కరుప్పస్వామి ఆమెతో ఏకాంతంగా గడపడం మొదలు పెట్టాడు. ఎడ్విన్ లేని సమయంలో కరుప్పస్వామి సెల్వీ ఇంటికి వెళ్లి ఆమెతో జల్సాలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఎడ్విన్ కరుప్పస్వామి లేని సమయంలో ఇంటిని అద్దెకు తీసి ఇచ్చిన ముగ్గురు వ్యక్తులో సెల్వీ ఇంటికి వచ్చి వెళ్లేవారని సమాచారం. సెల్వీ ఒకరి తెలీకుండా ఒకరిని ఇంటికి పిలిపించుకుని వారితో అక్రమ సంబంధం కొనసాగించింది.

గంటలో 10 ఫోన్లు

గంటలో 10 ఫోన్లు

రాత్రి 11 గంటలకు కరుప్పస్వామి తన ప్రియురాలు సెల్వీ ఇంటికి వెళ్లాడు. తరువాత ఇంటిలో కరుప్పస్వామి, సెల్వీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక గంటలో 10కి పైగా సెల్వీ మొబైల్ కు ఫోన్లు వచ్చాయి. ఆ సమయంలో మొబైల్ స్వీచ్ ఆఫ్ చెయ్యాలని కరుప్పస్వామి ప్రియురాలు సెల్వీకి చెప్పాడు.

చంపేసి తలగబెట్టాడు

చంపేసి తలగబెట్టాడు

మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే విషయంలో సెల్వీ, కరుప్పస్వామి మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరడంతో సహనం కొల్పోయిన కరుప్పస్వామి కత్తి తీసుకుని సెల్వీని దారుణంగా పొడిచి హత్య చేశాడు. తరువాత సెల్వీ మృతదేహం మీద పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేసిన కరుప్పస్వామి ఇంటి బయట తాళం వేసి పరారైనాడు.

10 మందితో అక్రమ సంబంధం

10 మందితో అక్రమ సంబంధం

సెల్వీ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా సెల్వీ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. ఇంటిని అద్దెకు తీసిచ్చిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్వీ 10 మందికి పైగా అక్రమ సంబంధం సాగిస్తోందని, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని ఇంటిని అద్దెకు ఇప్పించిన వారు చెప్పారని పోలీసులు తెలిపారు. సెల్వీ మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ కరుప్పస్వామిని అదుపులోకి తీసుకున్నారు. సెల్వీని తానే హత్య చేశానని కరుప్పస్వామి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఊరికి వెళ్లిన ఎడ్విన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+