'మీ హెడ్ లైన్స్ నాకు డెడ్ లైన్ కాదు' : వెంకయ్య
న్యూఢిల్లీ : ఉగ్రవాదుల హెచ్చరికలను బేఖాతరు చేయకుండా.. సార్క్ సమావేశాల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ పాక్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైటెన్షన్ నడుమ సాగుతోన్న రాజ్ నాథ్ పాక్ పర్యటనపై అటు మీడియా వర్గాల్లోను.. ఇటు ప్రజల్లోను ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతోన్న సందర్బంలో రాజ్ నాథ్ పర్యటనపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయితే రాజ్ నాథ్ ఇంకా ఇండియా తిరిగి రాకముందే పర్యటన వివరాలను వెల్లడించడం కుదరదని తేల్చి చెప్పారు.

పాక్ లో జరుగుతోన్న సదస్సు వివరాలు వెల్లడించాలంటూ మీడియా ప్రతినిధులు వెంకయ్యను కోరడంతో.. యువర్ హెడ్ లైన్ ఈజ్ నాట్ మై డెడ్ లైన్ అంటూ వ్యాఖ్యానించారు. మీడియా హెడ్ లైన్స్ కోసం తాను వివరాలు వెల్లడించబోను అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. దీనిపై మరింతగా స్పందిస్తూ.. జాతీయ ప్రయోజనాల రీత్యా కేంద్రానికి ఓ స్పష్టమైన విధానం ఉందని, ఆ పంథాలోనే సాగుతున్నామని వివరించారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో..సభలోనే పాక్ సదస్సుపై రాజ్ నాథ్ పూర్తి వివరాలు వెల్లడిస్తారని, అప్పటిదాకా ఓపిగ్గా వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications