వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్ 1: ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు హెచ్చరికలు చేసింది. నెట్‌ బ్యాంకింగ్‌కు మీ మొబైల్‌ నెంబరు రిజిస్టర్‌ చేసుకోలేదా? అయితే.. ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీ తర్వాత మీ నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్‌బీఐ వినియోగదారుల కోసం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

'ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్లు.. వెంటనే మీ మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేయించుకోండి. లేదంటే డిసెంబరు 1, 2018 నుంచి మీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేయబడును' అని ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఇచ్చిన గడువు లోపు మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా సూచించింది.

Your SBI net banking facility may get blocked if mobile number is not registered by Dec 1

ఖాతాదారుల బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు మొబైల్‌ నెంబరును రిజిస్టర్‌ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.

English summary
If you are an Internet banking user of State Bank of India (SBI), you have to register your mobile number with the bank by December 1, 2018. If you do not register it before the deadline, you will not be able to access your net banking account after December 1, i.e., it will be blocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X