పాక్ అమ్మాయి-భారత్ అబ్బాయి పెళ్లికి గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఇండియా అబ్బాయి- పాకిస్థాన్ అమ్మాయి పెళ్లికి శుభం కార్డు పడుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హామి ఇచ్చారు. త్వరలో పాక్ అమ్మాయి-భారత్ అబ్బాయి పెళ్లి రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరగనుంది.

రాజస్థాన్ లోని జోథ్ పూర్ కు చెందిన నరేష్ తేవానీకి పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ప్రియా బచ్చానికి 2014లో నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్బంలో ప్రియా కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్ వచ్చి వెళ్లారు.

ఇటీవల భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముందుగానే వీరి పెళ్లి 2016 నవంబర్ 7వ తేది జోథ్ పూర్ లో చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇప్పుడు ప్రియాకు వీసా రాకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

అసలు అనుకున్న టైంకి పెళ్లి జరుగుతుందా అని ఆందోళన చెందారు. పాకిస్థాన్ లోని ఇండియన్ ఎంబసీ ప్రియా, ఆమె కుటుంబ సభ్యులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. నరేష్ తన గోడునంతా ప్రధాని మోడీకి, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్విట్టర్ ద్వారా చేరవేశాడు.

వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్ డోల్ట్ వరీ, మీ సమస్యను పరిష్కరిస్తాను అని ట్విట్ చేశారు. త్వరలో వీరి పెళ్లి రంగరంగ వైభంగా జరగనుందని వరుడు నరేష్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+