కాళీమాతను ప్రసన్నం చేసుకొనేందుకు తల్లినే బలిచ్చాడు

పురులియా:శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మానవుడు ప్రగతిని సాధించినా ఇంకా మూఢ విశ్వాసాల్లో కొందరు కొట్టుమిట్టాడుతున్నారు. కాళీ మాతను ప్రసన్నం చేసుకొనేందుకుగాను పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు తన తల్లినే బలి ఇచ్చాడు.

దేవతలను ప్రసన్నం చేసుకొనేందుకుగాను నరబలి ఇచ్చే సన్నివేశాలను పౌరాణిక సినిమాల్లో చూస్తుంటాం,.కాని, ఇదే తరహా ఘటన ఒకటి బెంగాల్ రాష్ట్రంలోని పురులియా జిల్లాలోని బమగ్రామ్ లో చోటుచేసుకొంది.

నారాయణ మహతో అనే వ్యక్తి తన తల్లినే కాళీమాతను ప్రసన్నం చేసుకొనేందుకుగాను బలి ఇచ్చారు. నారాయణ్ మహతో బరబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బమగ్రామ్ లో తన ఇంటిలోనే నిర్మించుకొన్న కాళీమాత ఆలయ ఆవరణను శుభ్రం చేస్తున్న తన తల్లి పులి మహతోకు శిరచ్ఛేదం చేశాడు. జంతువులను బలి ఇచ్చేందుకు ఉపయోగించే పదునైన బ్లేడును ఉపయోగించాడు నారాయణ మహతో.

Youth beheads mother as offering to Goddess Kali

అయితే తల్లి కాళీమాత విగ్రహం ముందు తల నరుక్కొందని తన సోదరుడి ఇంటికి వెళ్ళి చెప్పారు.అయితే అతను వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళాడు.అయితే కాళీ మాత విగ్రహం ముందు పులి మహాత తల, మొండెం వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉన్నాయి. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయాన్ని వెల్లడించాడు నిందితుడు. కాళీమాతను ప్రసన్నం చేసుకొనేందుకే తాను తల్లి తల నరికేశానని చెప్పారు.కుటుంబం బాగుండాలంటే తన తల్లిని బలి ఇవ్వాలని కాళీమాత తనకు కలలో చెప్పిందని నిందితుడు చెప్పాడు.అయితే నారాయణ మహతో తాంత్రిక పూజలు నిర్వహిస్తాడని స్థానికులు చెప్పారు.

పోలీసులు శుక్రవారం రాత్రి నారాయణ్ మహతోను అదుపులోకి తీసుకున్నారు. కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తానే తన తల్లి తల నరికానని పోలీసుల ఇంటరాగేషన్‌లో నారాయణ్ మహతో అంగీకరించాడు. కుటుంబం బాగుండాలంటే తన తల్లిని బలివ్వాలని కాళికాదేవి తనకు కలలోకి వచ్చి చెప్పిందని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, నిందితుడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు ఏ ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టాడనే విషయమై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి చెప్పారు. కాగా, నారాయణ్ మహతో తాంత్రికుడని, క్షుద్ర పూజలు చేస్తుంటాడని, అందుకే ఇంట్లోనే కాళికాదేవి ఆలయాన్ని నిర్మించుకున్నాడని ఇరుగు పొరుగు వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+