'తొలిరాత్రి' తర్వాత ఆత్మహత్య: సూసైడ్ నోట్‌లో 'ఇదీ విషయం'..

బెంగళూరు: పెళ్లై 24గం. కూడా గడవకముందే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లపూర్‌లో చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే అతని ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్ నోట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది.

 లైన్‌మెన్‌ మునిరాజు..:

లైన్‌మెన్‌ మునిరాజు..:

చిక్కబళ్లాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులికుంటే ప్రాంతంలో నివసించే మునిరాజు(30) అనే యువకుడుకి సోమవారం తన అక్క కుమార్తెతో వివాహం జరిగింది. స్థానికంగా ఇతను లైన్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

శోభనం గదిలో అన్యమనస్కంగా..:

శోభనం గదిలో అన్యమనస్కంగా..:

చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహా అనంతరం నవ దంపతులను తీసుకుని కుటుంబ సభ్యులు ఇంటికొచ్చారు. సాంప్రదాయం ప్రకారం ఆరోజు రాత్రి దంపతులకు తొలిరాత్రి ఏర్పాటు చేశారు. అన్యమనస్కంగానే గదిలోకి అడగుపెట్టిన మునిరాజు.. భార్యతోనూ ఏమి మాట్లాడలేదని తెలుస్తోంది.

 ఆత్మహత్య.., భార్యను సోదరుడికిచ్చి పెళ్లి చేయాలని!:

ఆత్మహత్య.., భార్యను సోదరుడికిచ్చి పెళ్లి చేయాలని!:

ఆ మరుసటిరోజు ఉదయమే పక్క గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మునిరాజు. అంతకుముందు ఒక సూసైడ్ నోట్ కూడా రాసినట్లు పోలీసులు గుర్తించారు. తన భార్యను తన సోదరుడికిచ్చి వివాహం జరిపించాలని సూసైడ్ నోట్ లో మునిరాజు పేర్కొనడం గమనార్హం.

 కళ్లు దానం చేయాలని..:

కళ్లు దానం చేయాలని..:

ఇక పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. పెద్దల బలవంతం మీదనే తాను అక్క కుమార్తెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని మునిరాజు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను చనిపోయాక తన కళ్లను కె.ఎన్.మంజునాథ్ అనే వ్యక్తికి దానం చేయాలని కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+