మూడేళ్ల చిన్నారిపై రేప్, యువకుడికి పదేళ్ల జైలు

బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మత్ మొయీమ్ అనే వ్యక్తి 2011లో మూడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేశాడు. ఈ కేసును తూర్పు ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు విచారించింది.
ఇలాంటి అత్యాచార ఘటనలు ఇటీవలి కాలంలో సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా చిన్నారులు ప్రమాదంలో ఉన్నారని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయని, ఏమీ తెలియని చిన్నారుల పట్ల లైంగిక వేధింపులు తీవ్రమైనవని, ఇలాంటి వాటి పట్ల ఉపేక్షించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన నవంబర్ 2011లో జరిగింది. బాధిత బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా నిందితుడు ఆమెను తీసుకు వెళ్లాడు. అతను బాలికను పార్కుకు తీసుకు వెళ్లి అక్కడి పొదల్లో అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications