లైవ్‌షోలో ఘోరం: నిప్పంటించుకొని, కౌగిలించుకున్నాడు

దూరదర్శన్ జనమంచ్ లైవ్ కార్యక్రమంలో భాగంగా.. సుల్తాన్ పుర్‍లోని టికోనియా పార్కులో సోమవారం సాయంత్రం నాయకులు మాట్లాడుతున్నారు.
ఈ సమయంలో దుర్గేష్ కుమార్ సింగ్ అనే యువకుడు తన పైన పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అక్కడే ఉన్న బిఎస్పీ అబ్యర్థి కమ్రుజమ్మ ఫౌజిని కౌగిలించుకున్నాడు.
ఈ ఘటనలో వీరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దుర్గేష్ మౌ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇతను టికోనియా పార్కు దగ్గర్లోని హోటల్లో ఉంటున్నాడు. అతను ఎందుకు అలా చేశారనే విషయం ఇంకా తెలియరాలేదు.












Click it and Unblock the Notifications