పాకిస్థాన్ ఏజెంట్లతో బయటపడ్డ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భాగోతం..ఏకంగా నలుగురితో ఎఫైర్..?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో రోజురోజుకూ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తుండగా, తాజాగా బయటపడిన ఆధారాలు ఈ కేసును మరింత జఠిలం చేస్తున్నాయి. దేశద్రోహం కోణంలో తీవ్ర స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకొని, దాదాపు 12 జీబీ డేటాను రికవరీ చేశారు. ఈ డేటా విశ్లేషణలో వారు గుర్తించిన అంశాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి.జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సీక్రెట్ కోడ్ భాషలో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో భారత నిఘా కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారనే దానికి ఆధారం దొరికినట్టు అయింది. పాక్ ఎంబసీకి చెందిన డానిష్‌తో మాత్రమే కాకుండా, మరో నలుగురితో కూడా జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

YouTuber Jyoti Malhotra had any relations with four Pakistani agent

వీరిలో అహ్సాన్, షాహిద్ అనే కొత్త పేర్లతో పాటు మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. వీరు ఐఎస్ఐలో ఏ హోదాలో పనిచేస్తున్నారనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ బహుళ సంబంధాల వెనుక దేశ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేయడం, భారత సైన్యం, ప్రభుత్వ సమాచారాన్ని సేకరించడం వంటి కుట్ర కోణాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు అందివచ్చిన "రాజభోగాలు", "వీఐపీ ట్రీట్‌మెంట్" చూస్తుంటే, మన దేశం గురించి ఆమె ఎంత సమాచారం అందించింది, ఎంత సహకరించింది అనే అనుమానాలు బలపడుతున్నాయి.

జ్యోతి మల్హోత్రా నోటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని రాబట్టడానికి పోలీసులు సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు లభించిన ఆర్థిక లాభాలు, ప్రత్యేక సేవలు, విదేశీ ప్రయాణాల వెనుక ఉన్న అసలు కారణాలు, ఆమె దేశానికి చేసిన ద్రోహం వంటి విషయాలపై పోలీసులు పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటపడే అవకాశం ఉంది.ఈ కేసు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో, పోలీసులు ఎటువంటి దాపరికం లేకుండా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+