ఒకే దెబ్బకు మూడు పిట్టలు, చంద్రబాబు, బాలయ్య, పవన్ ల మీద పెద్దిరెడ్డి ప్రయోగం, జగన్ స్కెచ్!
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కడప జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించి ఆ నియోజక వర్గాల్లో గెలుపు బాధ్యత మీదే అని సీఎం వైఎస్ జగన్ సూచించారని సమాచారం.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెద్దిరెడ్డి సొంత తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముద్దుల కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ టిక్కెట్ మీద రాజంపేట లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

సొంత నియోజక వర్గం పుంగనూరుతో పాటు తంబళ్లపల్లె, రాజంపేట, మదనపల్లె, పీలేరు, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు, నగిరి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, కదిరి, శ్రీకాళహస్తి, పుట్టపర్తి, మడకశిర, రాప్తాడు, హిందూపురం తదితర నియోజక వర్గాల ఇన్ చార్జ్ బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డకి అప్పగించారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు. హిందూపురం లోక్ సభ నియోజక వర్గాల బాధ్యత కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం వైసీపీ బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటున్నారు. గతంలో జరిగిన కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి మెజారిటీ తగ్గిపోవడానికి, కుప్పం మునిసిపాలిటిలో వైసీపీ జెండా ఎగరడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి కుప్పంను టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి ఈసారి చంద్రబాబును ఓడించాలనే ప్లాన్ చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.
అయితే ఇందులో నగిరి నియోజక వర్గం మినహాయించి మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలు, లోక్ సభ నియోజక వర్గాల ఇన్ చార్జ్ లతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్థానిక అభ్యర్థులను గెలిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలయ్య హ్యాట్రిక్ కొట్టకుండా ఆయన్ను ఓడించే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీసుకున్నారని సమాచారం.

ఇప్పటికే హిందూపురంలో అనేక సభలు, సమావేశాలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతిని హిందూపురంలోనే పెట్టి బాలయ్య ఓటమికి పావులు కదుపుతున్నారని తెలిసింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పొటీ చేస్తున్న పిటాపురంలోని ఒక మండలం ఇన్ చార్జ్ బాధ్యతలను వైసీపీ ఎంపీ, మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారని ఇప్పటికే తెలిసింది.
మిథున్ రెడ్డి సైతం పిఠాపురంలోని ఆ మండలం వైసీపీ నాయకుతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వంగా గీత గెలుపుకు పని చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలయ్యను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోని ఓ మండలంలో ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు. చంద్రబాబు, బాలయ్య, పవన్ కల్యాణ్ మీద పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications