విభజన: జయలలితతో జగన్, చెన్నైలోనూ ఘనస్వాగతం
చెన్నై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలితతో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టడంలో భాగంగా జగన్ కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా బుధవారం చెన్నైకి వచ్చిన జగన్ తమిళనాడు ముఖ్యమంత్రిని కలిశారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరారు. గతంలో జగన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ, జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, బిజెపి, లెఫ్ట్ పార్టీల నేతలను కలిశారు.

కాగా, అంతకుముందు చెన్నై విమానాశ్రయంలో జగన్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు గంటలకు జయలలితతో భేటీ అయిన జగన్ సాయంత్రం ఐదు, ఆరు గంటల మధ్య డిఎంకె అధినేత కరుణానిధిని కలుసుకుంటారు.

చెన్నై విమానాశ్రయంలో దిగిన జగన్ నేరుగా తన సోదరుడు వైయస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుండి పార్టీ ప్రతినిధులు, బంధువులను కలుసుకున్నారు. రాత్రి చెన్నైలోనే బస చేసి గురువారం హైదరాబాదుకు వస్తారు.












Click it and Unblock the Notifications