వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకెళ్దాం: ఢిల్లీ వీధుల్లో జగన్ ఆగ్రహించారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అడ్డగోలుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ ఐక్యత చూపితే కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేయడం ఖాయమన్నారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం నిర్వహించిన పార్టీ ధర్నాలో ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభిజిస్తోందన్నారు. రాష్ట్రాన్ని విభజించాక కాంగ్రెస్‌కు రాజకీయ భవితవ్యం ఉండదని అన్నారు. నదీ జలాలు, నిధుల కేటాయింపు,విద్య, ఉద్యోగాలు తదితర వౌలిక అంశాలను గాలికొదిలేసి సీమాంధ్రుల ప్రయోజనాలు పట్టించుకోకుండా రాష్ట్ర విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు.

హైదరాబాద్ లేకుంటే సీమాంధ్ర యువత భవిష్యత్ ఏమిటన్న విషయమై కాంగ్రెస్ హైకమాండ్ జవాబు చెప్పాలన్నారు. లోక్‌సభలో స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని, సీమాంధ్ర ఎంపీలపై ఏకపక్షంగా సస్పెన్షన్ వేటు వేశారని విమర్శించారు. విభజనను అడ్డుకునేందుకు తాము అన్ని పార్టీల సహకారాన్ని అర్థిస్తున్నామన్నారు. అనంతరం జగన్ పార్లమెంటు ముట్టడికి వెళ్లగా పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్

జగన్

రాష్ట్రాన్ని విభజించి సోనియా గాంధీ రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్న జగన్ సోనియా గాంధీపై చాలా రోజుల తర్వాత విమర్శలు చేశారు.

జగన్

జగన్

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెసు రాష్ట్రాన్ని విభజిస్తోందని అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి కొన్ని సీట్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అందుకు పాల్పడుతోందని ఆయన అన్నారు.

జగన్

జగన్

సోనియా గాంధీ ఇటలీ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెసును జగన్ ఇటాలియన్ నేషనల్ కాంగ్రెసుగా అభివర్ణించారు.

జగన్

జగన్

తమ రాష్ట్రంలో సోనియా గాంధీ చేసిన పని బ్రిటిష్ వాళ్లు కూడా చేయలేదని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టడం సీమాంధ్ర పార్లమెంటు నుంచి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసే కుట్రలో భాగంగా జరిగిందని ఆయన అన్నారు.

జగన్

జగన్

కాంగ్రెసు పార్టీయే అల్లర్లను ప్రేరేపిస్తోందని, పథకం ప్రకారం ఆ పనిచేస్తున్నారని, తమకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వారు ఆ చర్యకు దిగారని, ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉన్న సమయంలో తమ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు.

జగన్

జగన్

గొంతు నొక్కడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. చర్చ లేకుండానే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నదని ఆయన అన్నారు.

జగన్

జగన్

వైయస్ జగన్ ధర్నాలో మాట్లాడుతూ.. కలిసి ఉండగానే రాష్ట్రంలో ఇంత నీటి సమస్య ఉంటే విడిపతో ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే దిగువన ఉన్న ఎపికి మరింత నష్టం జరుగుతుందన్నారు.

జగన్

జగన్

ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. ఉభయ ప్రాంతాల అంగీకారం లేకుండా ఇదివరకు రాష్ట్రాల విభజన జరగలదేన్నారు.

జగన్

జగన్

శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెసు పార్టీ ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ధ్వజమెత్తారు.

జగన్

జగన్

రాష్ట్రం విడిపోయాక సీమాంధ్రులు హైదరాబాదులో ఉండవచ్చునని చెబుతున్నారని కానీ మహారాష్ట్రలో ఎంఎన్ఎస్, కర్నాటకలో కన్నడిగుల పార్టీ, తమిళనాడులో ద్రవిడ పార్టీలో ఎందుకున్నాయన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy has offered his party's support to the BJP if it made an effort to stall the Telangana Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X