వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ కోసం కదిలిన మోదీ సర్కార్ -కరోనాలోనూ ఢిల్లీ ఎయిమ్స్‌లో స్పెషల్ చేరిక -కష్టంలో తోడున్నందుకు

|
Google Oneindia TeluguNews

దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్జు ఇచ్చిన బెయిల్ పై విడుదలైన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దేశ రాజధానిలో కరోనా ఉధృతంగా ఉండటంతో ఎయిమ్స్ మొత్తాన్ని కొవిడ్ రోగుల కోసం వాడుతుండగా, కేంద్రం పెద్దల జోక్యంతో అదే ఆస్పత్రిలో వైసీపీ రెబల్ ఎంపీకి ప్రత్యేక వార్డు కేటాయించడం గమనార్హం. అరెస్టు ఘటన తర్వాత రెబల్ ఎంపీ తొలిసారి కీలక ట్వీట్ చేశారు. వివరాలివి..

Covid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టుCovid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టు

రఘురామకు మంత్రుల ఫోన్లు..

రఘురామకు మంత్రుల ఫోన్లు..

ఏడాదిన్నర కాలంగా వైసీపీ సర్కారుపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయి విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న రెబల్ ఎంపీపై ఏపీ సీఐడీ సుమోటోగా దేశ ద్రోహం కేసు నమోదు చేయడం, కస్టడీలో పోలీసులు కొట్టారని ఎంపీ ఫిర్యాదు చేయడంతో వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లడం, సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో టెస్టుల అనంతరం బెయిల్ పై విడుదలైన ఆయన బుధవారమే ఢిల్లీకి వెళ్లడం తెలిసిందే. కాలిపై అనుమానిత గాయాలకు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లిన వైసీపీ రెబల్ ఎంపీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకొందరు బీజేపీ ముఖ్యులు కూడా ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది. అంతేకాదు..

 కేంద్రం చొరవతో ఎయిమ్స్‌లోకి..

కేంద్రం చొరవతో ఎయిమ్స్‌లోకి..

నిజానికి ఎంపీ రఘురామ ఎయిమ్స్ లో చేరడానికే ఢిల్లీకి వెళ్లినప్పటికీ, ఆ ఆస్పత్రి ప్రస్తుతం కొవిడ్ రోగులతో నిడిపోయినందున ప్రత్యేక వార్డు సదుపాయం కల్పించేందుకు ఆలస్యమైంది. ఎంపీగా ఆయనకు ప్రివిలేజ్ ఉన్నప్పటికీ, కరోనా ఉధృతి కారణంగా, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్.. ఎయిమ్స డైరెక్టర్ రణదీప్ గులేరియాకు ఫోన్ చేసి.. రఘురామ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారని తెలుస్తోంది. గురువారం ఉదయానికి స్పెషల్ వార్డు సిద్ధమైన తర్వాత స్వయంగా గులేరియానే ఎంపీ రఘురామకు ఫోన్ చేసి, ఎయిమ్స్ కు రావాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో..

విషప్రయోగం వ్యాఖ్యలు.

విషప్రయోగం వ్యాఖ్యలు.

రాజద్రోహం ఆరోపణలపై రఘురామను అరెస్టు చేసి ముందుగా గుంటూరుకు తరలించడం, అక్కడి జీజీహెచ్ లో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం, గుంటూరు జిల్లా జైలులోనూ ఒక రాత్రి ఉంచడం తెలిసిందే. ఏపీ సర్కారు తనకిచ్చిన చికిత్సపై ఎంపీ రఘురామ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. జీజీహెచ్ లో తనపై ఏదైనా విషప్రయోగం జరిగి ఉంటుందా అని రఘురామ అనుమానం వ్యక్తంచేశారని, అలాంటిదేదైనా జరిగిందో లేదో తేల్చాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్ ను ఎంపీ కోరినట్లు ఆంధ్రజ్యోతి ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. రఘురామపై దేశద్రోహం కేసులో ఏబీఎన్ ఛానల్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా,

వీల్ చైర్‌కే పరిమితమైన రెబల్

వీల్ చైర్‌కే పరిమితమైన రెబల్

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం ఢిల్లీకి వెళ్లిన సమయంలో, గురువారం ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన సందర్భంలోనూ ఎంపీ రఘురామ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడం, బీపీ నియంత్రణలోకి రాకపోవడం లాంటి సమస్యలతో ఆయన బాధపడుతోన్నట్లు తెలిసింది. ఎయిమ్స్ ప్రాంగణంలో తనను పలకరించిన మీడియాతో మాట్లాడేందుకు రఘురామ నిరాకరించారు. అయితే..

 తలొంచి థ్యాంక్స్ చెప్పిన రఘురామ..

తలొంచి థ్యాంక్స్ చెప్పిన రఘురామ..

మీడియాతో నేరుగా మాట్లాడేందుకు నిరాకరించినప్పటికీ వైసీపీ రెబల్ ఎంపీ సోషల్ మీడియా ద్వారా కీలక సందేశాన్నిచ్చారు. జగన్ సర్కారు మోపిన రాజద్రోహం కేసుకు సంబంధించిన విషయాలేవీ మీడియాతో లేదా సోషల్ మీడియాలో మాట్లాడరాదన్న షరతుపై సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఇవ్వడం తెలిసిందే. అయితే ఆ ఒక్క అంశం తప్ప సాధారణ ప్రకటనలకు ఎలాంటి అభ్యంతరం లేనందున.. అరెస్టు ఉదంతంపై ఎంపీ బుధవారం ట్వీట్ల చేశారు. ''ఈ కష్ట సమయం లో నాకు తోడుగా, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అని రఘురామ రాసుకొచ్చారు.

Recommended Video

Arogya Sri వల్ల రోజూ 25000 మందికి Covid చికిత్స జరుగుతుంది - Ys Jagan || Oneindia Telugu

English summary
narsapuram ysrcp mp raghu krishnam raju admitted in delhi aiims on thrusday. after getting bail in sedition case, the mp was discharged from secunderabad army hospital and went to delhi. due to covid surge and aiims was full busy threating covid cases, the central govt took special care of ysrcp rebel mp, union health minister harsh vardhan calls aiims chief regarding raghurama treatment. meanwhile, raghurama tweeets key message after arrest incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X