రాజ్యసభ, మండలిలోనూ మహిళా రిజర్వేషన్లు-వైసీపీ తాజా డిమాండ్...
దేశంలో లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరుగుతోంది. నిన్న లోక్ సభ ఆమోదించిన ఈ బిల్లుపై రాజ్యసభలో ఎంపీలు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీలో అధికార వైసీపీ మరో కొత్త డిమాండ్ లేవనెత్తింది. రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్ళలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని కోరారు.
రాజ్యసభ, మండలిలోనూ మహిళా రిజర్వేషన్ : రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో వైసీపీ తరఫున మాట్లాడిన ఎంపీ విజయసాయిరెడ్డి పలు కీలక అంశాలు ప్రస్తావించారు. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు విస్పష్టంగా మద్దతు తెలుపుతోందని ఆయన ప్రకటించారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్ళలో మహిళల రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని అన్నారు.

రాజ్యసభ, మండళ్ళలో సభ్యులు తమ టర్మ్ పూర్తవగానే రిటైర్ అవుతుంటారని, అందువల్ల రెండేళ్ళకు ఒకసారి ఖాళీలు ఏర్పడుతుంటాయన్నారు. కాబట్టి రాజ్యసభ, మండళ్ళలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 80, 171లను సవరించాలని సాయిరెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మకమైన బిల్లును ఈరోజున సభలో ప్రవేశపెట్టినందున ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిరిగానే చరిత్రలో మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సెప్టెంబర్ మాసాన్ని చారిత్రక మహిళా మాసంగా జరుపుకునేలా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీలో 50 శాతానికి మించే రిజర్వేషన్ : 1992లో రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్‌ను సవరించడం ద్వారా పంచాయతీలు, మునిసిపాలిటీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించారన్నారు. అయితే ఏపీలో జగన్ సర్కార్ .. చట్టబద్దంగా నిర్దేశించిన 33 శాతంకు మించే పంచాయతీలు, స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా అభ్యున్నతి పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మహిళకు ఏ విధంగా పెద్ద పీట వేసిందో గణాంకాలతో సహా ఆయన వివరించారు.
ఏపీలో అమలు ఇలా : ఏపీలోని స్థానిక సంస్థల్లో 1,356 ఖాళీలు ఉండగా అందులో 688 స్థానాలను అంటే 51 శాతం స్థానాలను మహిళలతో భర్తీ చేసినట్లు సాయిరెడ్డి తెలిపారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఏడింటిని మహిళలకు (అంటే 54 శాతం) కేటాయించామని అన్నారు. అలాగే 26 జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ పోస్టులు ఉంటే 15 పోస్టులను (అంటే 58 శాతం) మహిళలే ఉన్నారన్నారు. కార్పొరేషన్లలో మొత్తం 36 మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులలో 50 శాతం అంటే 18 పోస్టుల్లో మహిళల్ని నియమించామని తెలిపారు. 671 మునిసిపల్ కార్పొరేషన్, వార్డు సభ్యుల పదవుల్లో 53.8 శాతం పదవులు మహిళలకే దక్కాయన్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications