కేంద్రంపై అవిశ్వాసం: వైసీపీ వైఖరి ఇదే- సపోర్ట్ చేస్తామని ప్రకటించిన ఒవైసీ

న్యూఢిల్లీ: మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.

మణిపూర్ ఉదంతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. కేంద్రం అంగీకరించట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో విస్పష్ట ప్రకటన చేయాలనేది ప్రతిపక్ష పార్టీల ప్రధాన డిమాండ్.

ysrcpaimim1

మణిపూర్ అంశంపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లభించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు మరో అడుగు ముందుకేశారు. అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇవ్వాళ అది టేబుల్ అయింది. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ ఎప్పుడు జరగాలనే విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ఖరారు చేయాల్సి ఉంది.

కాగా- ఈ అవిశ్వాస తీర్మానంపై ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. కేంద్రానికి అనుకూలంగా ఉంటామని ప్రకటించింది. తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకుంది.

జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తటస్థ వైఖరిని అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏలో గానీ.. కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇండియా కూటమిలో గానీ వైఎస్ఆర్సీపీ భాగస్వామి కాదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తటస్థంగా ఉంటూ వస్తోంది. పార్లమెంట్‌లో కొన్ని కీలక బిల్లుల విషయంలో ఒకింత ఎన్డీఏ వైపే మొగ్గు చూపూతూ వస్తోంది.

jaganasaduddinowaisi

అటు కేంద్రం కూడా వైఎస్ఆర్సీపీతో ఎలాంటి ఘర్షణ వైఖరినీ ప్రదర్శించట్లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. నిధులను కేటాయించడంలో, వాటిని ఎప్పటికప్పుడు విడుదల చేయడంలో పెద్దగా జాప్యం చేయట్లేదు. కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి ఘర్షణ లేకపోవడం వల్ల ప్రస్తుతానికి వైసీపీ.. ఎన్డీఏకే అనుకూలంగా ఉంటోంది.

అదే సమయంలో- తెలంగాణకు చెందిన అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కూడా తన విధానం ఏమిటో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తామని తెలిపింది. ఈ మేరకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ- ఓ ప్రకటన విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+