Zee News Opinion Poll: టగ్ ఆఫ్ వార్: మళ్లీ ఆయనే కింగ్ మేకర్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకేదఫాలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ ఉదయం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభమైనట్లు ప్రకటించారు. ఇవ్వాళ్టి నుంచే ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చింది.
ఈ పరిణామాల మధ్య అంచనాలు, ఒపీనియన్ పోల్స్ వెలువడుతున్నాయి. ఏబీపీ సీఓటర్- ఇదివరకే తాను నిర్వహించిన ఒపీనియన్ పోల్ ను వెల్లడించింది. కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సర్వే చేపట్టిందా సంస్థ. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, పురుషులు, యువకులు, విద్యార్థులు, వారి వయస్సు.. ఇలా అందరి అభిప్రాయాలను సేకరించింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంది.

ఈ ఒపీనియన్ ప్రకారం- ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అంచనా వేసింది. సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపింది. మొత్తం 224 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 115 నుంచి 127 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. బీజేపీ ఈ దఫా ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని అభిప్రాయపడింది. బీజేపీకి 68 నుంచి 80 వరకు సీట్లు దక్కొచ్చని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)కు ఆశించిన స్థాయిలో సీట్లు లభించే అవకాశాలు లేవని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. జేడీఎస్‌కు 23 నుంచి 35 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.
ఇక తాజాగా జీ న్యూస్ తన ఒపీనియన్ పోల్ ను వెలువడించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కర్ణాటకలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ చేపట్టింది. మొత్తంగా 56,000 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించింది. తాజాగా ఆ వివరాలను వెల్లడించింది. ఏబీపీ సీఓటర్‌కు భిన్నంగా దీని అంచనాలు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ ఉంటుందని స్పష్టం చేసింది.

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జీ న్యూస్ ఒపీనియన్ తెలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఏ పార్టీకి కూడా రాదని పేర్కొంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 96 నుంచి 106 వరకు సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 88 నుంచి 98 సీట్లు లభిస్తాయని పేర్కొంది. ఇక జేడీఎస్ 23 నుంచి 33 అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగురవేస్తుందని అభిప్రాయపడింది.
దీన్ని బట్టి చూస్తే- మళ్లీ జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలు లేకపోలేదు. గరిష్ఠంగా 33 స్థానాలతో ఏ పార్టీకి మద్దతు ప్రకటిస్తే- ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారనడంలో సందేహాలు అక్కర్లేదు. పార్టీలవారీగా ఓట్ల శాతంలో కాంగ్రెస్ ముందంజలో కనిపించింది. బీజేపీ 38.3 శాతం ఓట్లను సాధించగా.. కాంగ్రెస్ 40.4 శాతం మేర ఓట్లను అందుకుంటుంది.
జేడీఎస్ 16.4 ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుందని జీ న్యూస్ పేర్కొంది. కుమారస్వామి కింగ్ మేకర్ గా మారుతారని 30 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడటం కూడా చర్చనీయాంశమౌతోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని 41 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో 22 శాతం మంది ఓటర్లు మాత్రం ఆ ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇక బీఎస్ యడ్యూరప్పకు బదులుగా బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా చేయడం వల్ల బీజేపీ లాభపడుతుందని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 21 శాతం మంది దీన్ని వ్యతిరేకించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications